గోలిగూడెంను గ్రామపంచాయతీగా ఏర్పాటుకు అఖిలపక్ష నాయకుల ఆమోదం

హర్షం వ్యక్తం చేసిన గోలిగూడెం గ్రామస్తులు

గోలిగూడెంను గ్రామపంచాయతీగా ఏర్పాటుకు అఖిలపక్ష నాయకుల ఆమోదం

IMG_20230928_115340
గ్రామ సభలో పాల్గొన్న పులిగిల్ల గ్రామస్తులు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని పులిగిల్ల గ్రామం మదిర గోలిగూడెంను ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయుటకు పులిగిల్ల గ్రామ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆమోదం తెలపడం జరిగింది. శుక్రవారం రోజున ఏర్పాటు చేసిన గ్రామసభలో గ్రామ వార్డు మెంబర్లు గ్రామ పెద్దలు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామ వివిధ పార్టీల అధ్యక్షుల అందరి సమక్షంలో జరిగిన సమావేశంలో గోలిగూడెంను ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయుటకు ప్రతి ఒక్కరి అభిప్రాయ, సంతకాల సేకరణ చేసి ఏర్పాటు కోసం ప్రతి ఒక్కరూ తీర్మానం చేయడం జరిగింది. గ్రామపంచాయతీ ఏర్పాటు చేయుటకు తగినంత ఓటర్ శాతం కూడా ఉండడంతో గోలిగూడెం గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున గ్రామసభకు హాజరవ్వడం జరిగింది. పులిగిల్ల గ్రామ ప్రజలు అందరూ ఆమోదం తెలపడంతో వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జక్కా వెంకట్ రెడ్డి, ఎంపీటీసీ బండారు ఎల్లయ్య, గ్రామ సెక్రెటరీ బూడిద పావని,ఉపసర్పంచ్ ఫైళ్ళ రవీందర్ రెడ్డి, వార్డు మెంబర్లు గ్రామ పార్టీల అఖిలపక్ష నాయకులు, గ్రామ యువత, తదితరులు పాల్గొనడం జరిగింది.

Views: 456
Tags:

Post Comment

Comment List

Latest News