గణపయ్య నీకు ఇక సెలవయ్య
వేలం పాటలో అధిక ధరకు లడ్డు దక్కించుకున్న ఎడ్ల సందీప్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం రోజున వినాయక నిమర్జనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లడ్డు వేలంపాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో పలువురు పోటీపడ్డప్పటికీ 40,000 రూపాయలకు ఎడ్ల సందీప్ రెడ్డి కైవసం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవరాత్రులు పూజలు అందుకున్న విజ్ఞనాధుని లడ్డును తీసుకోవడం ఆనందంగా ఉందని ఎడ్ల సందీప్ రెడ్డి తెలియజేశారు. అనంతరం ఫ్రెండ్స్ యూత్ సభ్యులు ఆటపాటలతో గణనాథున్ని నిమజ్జనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వడ్డేమాన్ దేవేందర్, వడ్డేమాన్ సుందరయ్య, మారబోయిన సతీష్, వడ్లకొండ మహేష్, వడ్డేమాన్ అశోక్, రాచమల్ల భాస్కర్, వడ్డేమాన్ గణేష్, మారబోయిన ప్రశాంత్, వాకిటి సాయికుమార్, రాచమల్ల నరేష్, ఫ్రెండ్స్ యూత్ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Comment List