అప్పుల బాధతో వ్యక్తి అదృశ్యం
కోలారియా నవీన్ కుమార్
On
అప్పుల బాద భరించలేక ఓ వ్యక్తి అదృశ్యమై సంఘటన ఎల్బినగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎల్బినగర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ దయాకర్ రెడ్డి కథనం ప్రకారం లింగోజిగూడకు చెందిన నవీన్ కుమార్ కొలారియా వ్యాపారం చేస్తూ భార్యా ఇద్దరు పిల్లలతో బహుదూర్ గూడలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పులు పాలైయ్యాడు. దీంతో అప్పులు తీర్చలేక నవీన్ కుమార్ తీవ్రమనస్తాపానికి గురైయ్యాడు. 20 సెప్టెంబర్ 2023 నాడు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్ళి తిరిగి రాలేదు. దీంతో చుట్టుపక్కల, బంధువులను ఆరా తీసిన ఫలితం లేదని అతని భార్య పూజా కొలారియా శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఎల్బినగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Views: 22
Tags:
Comment List