బిజెపిలోకి భారీగా వలసలు

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సి.ఎన్.రెడ్డి

బిజెపిలోకి భారీగా వలసలు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని ఆరూరు గ్రామానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు బిజెపి రాష్ట్ర నాయకులు సి ఎన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలోకి చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై సుమారు 40 మంది బిజెపిలోకి రావడం జరిగిందని ఆయన అన్నారు.  కెసిఆర్ పరిపాలన పట్ల రాష్ట్రంలోని ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని అందుకే ఈ కుటుంబ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని అందువల్ల రాష్ట్రంలో రాబోయే రోజుల్లో బిజెపి జెండా ఎగరడం ఖాయమని ఆయన అన్నారు.

Views: 163
Tags:

Post Comment

Comment List