బస్టాండ్ లేక బడి పిలల్ల కష్టాలు....

• పిల్లల భద్రత పట్ల తల్లితండ్రుల ఆవేదన...

On

బేస్తవారిపేట న్యూస్ ఇండియా

నేటి కాలంలో చిన్న చిన్న పల్లెలలకు కూడా బస్ షెల్టర్ లు అద్భుతంగా కనిపిస్తున్న కాలం ఇది.ఎప్రాంతంలో చూసినా ప్రయాణికులకు బస్సు కొరకు వేచి చూసుటకు చిన్న చిన్న బస్ షెల్టర్ లు అన్ని ప్రాంతాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.అయితే నేటికీ ఓ మండలానికి సరైన బస్టాండ్ లేక ప్రజలు తిర్వ ఇబ్బందులకు గురౌతున్నారు అంటే నమ్మశక్యంగా లేదుకదా కానీ ఇది నిజమే.ప్రపంచం మొత్తం కాంతి వేగంతో పరుగులు తిస్తునప్పటికి ఆ మండలానికి మాత్రం సరైన బస్టాండ్ లేదు అనటంలో సంకోసించనవసరం లేదు.ఇంతకీ ఆ మండలం ఏంటి అనుకుంటున్నారా ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజక వర్గంలోని బేస్తవారిపేట మండలం కు నేటికీ సరైన బస్టాండ్ సదుపాయం అందుబాటులోకి రాలేదు.దిని వలన ప్రజలు నానావస్థలు పడుతున్నారు.

• బస్సు కోసం తిప్పలు ....

బేస్తవారిపేటకు నిత్యం అనేక పనుల నిమిత్తం చుట్టూ ప్రకల పల్లెల నుండి ప్రజలు వస్తూనే ఉంటారు.ఎల్లవేళలా ప్రజలతో వాహనాలతో రద్దీగా ఉండే మండలాల్లో బేస్తవారిపేట కూడా ఒకటి.అయితే చెప్పుకొనుటకు బేస్తవారిపేట ఒక మండలం తప్ప అంతగా చెప్పుకోదగ్గ సౌకర్యాలు ప్రజలకి అందుబాటులో లేవని అనుకుంటున్నారు.ఎదేని పని నిమిత్తం వచ్చిన ప్రజలు తిరిగి వారి నివాసానికి వెళ్ళుటకు బస్సు కోసం వేచి చూడాలంటే సూర్యుడితో యుద్ధం చెయ్యాల్సిందే.సరైన బస్టాండ్ లేక ఎక్కడ వేచి చూడాలో తెలియక దుకాణాల మెట్లపై అలానే రోడ్లపై వేచి చూస్తున్నారు.యువకులు కొంత వరకు ఈ పరిస్థితిని ఎదుర్కోగలరు అయితే వృద్ధాప్యంలో ఉన్నవారి పరిస్థితి ఏమిటి అని సామాన్య ప్రజలు అనుకుంటున్నారు.ఎండకు వేచి ఉండలేక అధిక ధనం వెచ్చించి ఉన్నతమైన సౌకర్యాలతో ప్రయాణం చేయలేక సామాన్య ప్రజలు ఇబ్బందులకు పడుతున్నారు.

• రోడ్లపై విద్యార్థులు..

Read More నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి నిర్మాణం చేపట్టాలి - సిపిఐ డిమాండ్..!

బేస్తవారిపేటలో ఉన్న బాలికొన్నత పాఠశాలకు అలానే జెట్పిహెచ్ బాలుర పాఠశాలకు మండలం లోని అనేక పల్లెల నుండి విద్యార్థిని విద్యార్థులు వస్తుంటారు.వాటి విద్య రీత్యా రోజూ ఉదయం సాయంత్రం ప్రయాణం చేయక తప్పదు.అయితే బేస్తవారిపేట కి బస్ షెల్టర్ లేని కారణంగా లోక జ్ఞానం తెలియని ఈ విద్యార్థులకి కూడా అపాయం పొంచి ఉందని ప్రజలు అంటున్నారు.అవగాహన లేని విద్యార్థులు బస్టాండ్ లో అటు ఇటూ తిరుగుతూ పరుగులెత్తటం వలన వేగంతో వస్తున్న వాహనాలతో ఎటునుంచి అపాయం పొంచి ఉందో అని పిలల్ల తలిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.సాయంత్రం పాఠశాల ముగింపు సమయంలో బేస్తవారిపేట బస్టాండ్ ఆవరణంలో గమనిస్తే కొందరు విద్యార్థులు రోడ్లపై అటు ఇటూ తిరుగుతూ,మరి కొందరు విద్యార్థులు దుకాణాల బయట మెట్లపై కూర్చొని బడ్డులకొరకు వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.కనుక ఇప్పటికీ అయినా బేస్తవారిపేట మండలం కి ఒక బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Read More సంక్రాంతి మన దేశంలో జరుపుకునే పెద్ద పండుగ..

Views: 190
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News