హైదరాబాద్: అంతర్జాతీయ సెక్స్ రాకెట్ ముఠా అరెస్ట్

On

హైదరాబాద్‌ పోలీసులు అంతర్జాతీయ సెక్స్‌ రాకెట్‌ గుట్టు రట్టు చేశారు. ఈ భారీ ఆపరేషన్‌తో 14వేల 190మంది యువతులు.. వ్యభిచార కూపం నుంచి విముక్తి అయ్యారు. వెబ్ సైట్, వాట్సప్, కాల్ సెంటర్లు, యాడ్‌లలో కస్టమర్లను ఆకర్షించి అమ్మాయిలను సప్లయ్‌ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అంతర్జాతీయ ముఠాకు చెందిన 17 మంది హ్యుమన్ ట్రాఫికర్లను అరెస్ట్ చేశారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్.. భారీ సెక్స్ రాకెట్‌కు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మంగళవారం […]

హైదరాబాద్‌ పోలీసులు అంతర్జాతీయ సెక్స్‌ రాకెట్‌ గుట్టు రట్టు చేశారు.

ఈ భారీ ఆపరేషన్‌తో 14వేల 190మంది యువతులు.. వ్యభిచార కూపం నుంచి విముక్తి అయ్యారు.

వెబ్ సైట్, వాట్సప్, కాల్ సెంటర్లు, యాడ్‌లలో కస్టమర్లను ఆకర్షించి అమ్మాయిలను సప్లయ్‌ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

అంతర్జాతీయ ముఠాకు చెందిన 17 మంది హ్యుమన్ ట్రాఫికర్లను అరెస్ట్ చేశారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్..

Read More  ఘనంగా క్రిస్మస్ గాస్పల్ వేడుక

భారీ సెక్స్ రాకెట్‌కు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మంగళవారం వెల్లడించారు.

Read More సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన బోనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

ఈ ఆపరేషన్‌లో 17 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. 15 సిటీల నుండి యువతులను రప్పించి సెక్స్ రాకెట్స్ నడుపుతున్నారని..

వెబ్ సైట్, వాట్సాప్ గ్రూప్స్, కాల్ సెంటర్లు, యాడ్స్ ద్వారా కస్టమర్లను ఆకర్షించి అమ్మాయిలను పంపిస్తున్నారని తెలిపారు.

నిందితులకు 39 కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు. 1419 మంది అమ్మాయిలు

వ్యభిచార ముఠాలో చిక్కుకున్నట్లు గుర్తించామని.. వారందరికీ విముక్తి లభించిందని తెలిపారు.

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన యువతులతో పాటు విదేశీ మహిళలతో సెక్స్ రాకెట్స్ నడుపుతున్నారని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

సెక్స్ రాకెట్స్ తో పాటు డ్రగ్స్ కూడా సప్లై చేస్తూ కస్టమర్లకు ఎర వేస్తున్నారన్నారు.

ఇప్పటికే సైబరాబాద్ లో ఐదు కేసులు నమోదు చేసి, విచారిస్తున్నామని తెలిపారు.

మీడియేటర్లు, బ్రోకర్లు ద్వారా బాధిత మహిళలను కస్టమర్లు దగ్గరకు పంపుతున్నారని తెలిపారు.

విమానాల్లో కూడా అమ్మాయిలను ఇతర రాష్ట్రాల కస్టమర్ల దగ్గరకు పంపుతున్నట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు.

ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, ముంబై, కోల్‌కత్తాకు చెందిన వారు ఉన్నారని తెలిపారు.

ఇంకా బంగ్లాదేశ్, నేపాల్, రష్యాకు చెందిన అమ్మాయిలతోనూ సెక్స్​ రాకెట్​ దందా నడిపిస్తున్నారని చెప్పారు.

అనంతపురం, కరీంనగర్‌ నుంచి వ్యవహారాన్ని నడుపుతున్నారని..

సెక్స్‌ రాకెట్‌తో పాటు డ్రగ్స్‌ కూడా అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు.

ఈ డ్రగ్స్, సెక్స్ రాకెట్‌లో ఆర్నవ్‌, సమీర్‌ కీలకంగా ఉన్నారని తెలిపారు.

ఆర్నావ్ 915 మంది అమ్మాయిలను ముంబై, కోల్‌కతా నుంచి సప్లై చేయగా..

సమీర్ 850మంది యువతులను తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఉద్యోగాలు, లగ్జరీ లైఫ్ ఎరగా చూపించి

సమీర్‌, ఆర్నవ్‌ యువతులను సప్లై చేస్తున్నారని.. కొన్ని హోటల్స్‌తో అగ్రిమెంట్ కుదుర్చుకుని సైలెంట్‌గా బిజినెస్‌ నడుపుతున్నారని తెలిపారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News