షర్మిల అరెస్ట్ పై గవర్నర్ ఆగ్రహం
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు నమోదు చేసిన కేసులకు, చెబుతున్న కారణాలకు అసలు పొంతనే లేదని న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్ మంజూరు చేశారు. షర్మిలతో పాటు అరెస్టు చేసిన మరో ఐదుగురికి కూడా బెయిల్ మంజూరైంది. మరోపక్క షర్మిల అరెస్టు పరిణామాలపై గవర్నర్ తమిళిసై ఆందోళన వ్యక్తంచేశారు. షర్మిల కారులో ఉండగానే ఆ వాహనాన్ని క్రేన్‌తో […]
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
పోలీసులు నమోదు చేసిన కేసులకు, చెబుతున్న కారణాలకు అసలు పొంతనే లేదని న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్ మంజూరు చేశారు. షర్మిలతో పాటు అరెస్టు చేసిన మరో ఐదుగురికి కూడా బెయిల్ మంజూరైంది.
మరోపక్క షర్మిల అరెస్టు పరిణామాలపై గవర్నర్ తమిళిసై ఆందోళన వ్యక్తంచేశారు.
షర్మిల కారులో ఉండగానే ఆ వాహనాన్ని క్రేన్‌తో లాక్కెళ్లిన దృశ్యాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయన్నారు. రాజకీయాల్లో ఉన్న మహిళలను గౌరవప్రదంగా చూడాలని గవర్నర్ ట్వీట్ చేశారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List