నేడే వరంగల్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం రండి కదలి రండి..
తెలంగాణ ఉద్యమకారుడు మహేశ్వరం నియోజకవర్గం కో కన్వీనర్ కాకి నరసింహ ముదిరాజ్..
నేడే వరంగల్ రజతోత్సవ సభను

విజయవంతం చేద్దాం రండి కదలి రండి..
తెలంగాణ ఉద్యమకారుడు మహేశ్వరం నియోజకవర్గం కో కన్వీనర్ కాకి నరసింహ ముదిరాజ్..
రంగారెడ్డి జిల్లా, ఏప్రిల్ 26, న్యూస్ ఇండియా ప్రతినిధి: వరంగల్ లో నేడు బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దామని. తెలంగాణ ఉద్యమకారుడు మహేశ్వరం నియోజకవర్గం కో కన్వీనర్ కాకి నరసింహ ముదిరాజ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. బిఆర్ఎస్ వైపు ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. సభలో కెసిఆర్ ఏం మాట్లాడుతాడు అని దేశం మొత్తం ఆతృతగా ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగులు మోసం చేయడంతో, నిరుద్యోగులు సైతం సభకు తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. మాజీమంత్రి, శాసన సభ్యురాలు పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో కందుకూరు మండలం మహేశ్వరం నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున తెలంగాణ ఉద్యమకారులు రజహోత్సవ సభకు వెళ్లి సభను విజయవంతం చేస్తాం అని అన్నారు.
Comment List