సంగారెడ్డిలో శ్రీచైతన్య విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఆసుపత్రిలో పండ్లు పంపిణీ.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 26, న్యూస్ ఇండియా : శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు చిన్నారులకు పండ్లు అందచేశారు. ఈ సందర్బంగా చైతన్య విద్యాసంస్థల ఏజీఎం తాటి రాంబాబు, డీన్ వెంకటరెడ్డి, డీన్ బాలకృష్ణ లు మాట్లాడుతూ.. ఇటీవల విడుదల అయిన జెఇఇ మెయిన్స్ ఫలితాలలో ఆల్ ఇండియా లెవెల్స్ మొదటి ర్యాంక్, ఓపెన్ క్యాటగిరిలో 100 లోపు 10 ర్యాంకులు సాధించిన సందర్బంగా పండ్లు స్వీట్లు పంపిణీ చేశామని వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు లక్ష్యంగా శ్రీ చైతన్య కళాశాలలో విద్యాబుద్దులు నేర్పిస్తామని అన్నారు. ఈకార్యక్రమంలో ఏజీఎం రాంబాబు డీన్ లు వెంకటరెడ్డి, బాలకృష్ణ, అసోసియేట్ డీన్ శ్రీనివాస్, సంగారెడ్డి ఏరియా ఇంచార్జి సుబ్బారావు, ఎంఈఓ శ్రీకాంత్, ప్రిన్సిపాల్ శ్రీనివాస రావ్, రాంప్రసాద్, శ్రీచైతన్య అధ్యాపక బృందం సిబ్బంది పాల్గొన్నారు.
Comment List