విదేశీ ప్రతినిధుల సందర్శన.

On
విదేశీ ప్రతినిధుల సందర్శన.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 25, న్యూస్ ఇండియా : విదేశీ ప్రతినిధులు గ్రామాభివృద్ధి, జీవనశైలిలో వచ్చిన మార్పులు చూసి ప్రశంసలు వ్యక్తం చేశారు. సదాశివపేట మండలం, సూరారం గ్రామాన్ని సందర్శించిన 25 మంది విదేశీ ప్రతినిధులు సందర్శించారు. జిల్లా కలెక్టర్ కాంతి వల్లూరు, అధికారులు వారికి ఆత్మీయ స్వాగతం పలికారు. ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్ ద్వారా జరుగుతున్న ఉపాధి హామీ పనులను వారు పరిశీలించారు. వారు కూలీలతో మాట్లాడి పథకం అమలుపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్శన గ్రామస్థుల్లో ఆసక్తి కలిగించింది. అధికారులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్) అమలు తీరును సమీక్షంచేందుకు  వివిధ దేశాలకు చెందిన ప్రతినిధుల బృందం శుక్రవారం  పర్యటించారు. వారి వెంట  తెలంగాణ రాష్ట్ర పంచాయతీ  రాజ్ శాఖ కమిషనర్ సృజన,  అధికారులు వున్నారు. పథకానికి అనుసంధానంగా గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. బృందం సభ్యులు పథకానికి లబ్ధి పొందుతున్న గ్రామీణ కార్మికులతో మాట్లాడారు. ఉపాధి అవకాశాలు, వేతన చెల్లింపులు, మహిళల భాగస్వామ్యం వంటి అంశాలపై సమగ్ర సమాచారం సేకరించారు. వారు పథకం ద్వారా గ్రామీణ జీవన విధానంలో జరిగిన మార్పులను దగ్గరగా గమనించారు. పర్యటన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు విదేశీ బృందానికి  నీటి సంరక్షణ, పల్లె ప్రగతి కింద చేపడుతున్న పనులపై, సామాజిక తనిఖీ పై వివరించారు. విదేశీ ప్రతినిధులు తెలంగాణలో పథకం అమలు పద్ధతులను మెచ్చుకున్నారు. ప్రత్యేకించి, డిజిటల్ మానిటరింగ్ విధానాలు, పారదర్శక చెల్లింపుల వ్యవస్థలు, మహిళల భాగస్వామ్యం వంటి అంశాలను వారు ప్రశంసించారు. తెలంగాణలో ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్ పథకం గ్రామీణ అభివృద్ధికి ఒక ఆదర్శంగా నిలుస్తోందని వారు అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల్లో లేని ఈ ఉపాధి హామీ పథకం భారతదేశంలో మాత్రమే ఉన్నదని వారు ప్రశంసించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు వందరోజుల పని కల్పించడo గొప్ప విషయం అన్నారు. అంతకుముందు ఉపాధి హామీ పథకంలో చేసిన పనులతో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, అడిషనల్ కమిషనర్ శేషుకుమార్, ఎస్పిఎమ్ మురళి, పిడి డిఆర్డిఏ జ్యోతి, అదనపు డిఆర్డిఓ లు బాలరాజు, జంగారెడ్డి, ఎన్జీవో ప్రతినిధులు వర్షిని, పంచాయతీరాజ్ రెవెన్యూ శాఖల అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.Screenshot 2025-04-25 181241

Views: 3
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News