ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ జన్మదిన వేడుకలు.

On
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ జన్మదిన వేడుకలు.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 21, న్యూస్ ఇండియా : ప్రజలు తనపై చూపిన అభిమానానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలియజేశారు. సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ జన్మదిన వేడుకల సందర్భంగా, సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కేక్ కట్ చేశారు. అభిమానులు పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేను కలిసి శాలువాతో సన్మానించి పుష్పగుత్యంతో గజ మాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా మొదలుకొని ఐబీ, కొత్త బస్టాండ్, పాత బస్టాండ్ వద్ద ఫ్లెక్సీ లు వేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. క్యాంపు కార్యాలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే జన్మదిన వేడుకల్లో అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, జైపాల్ రెడ్డి పాల్గొని ఎమ్మెల్యే కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల ఆధారాభిమానాలు ఎల్లప్పుడూ తనపై ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బిఅర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతిధులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2025-04-21 at 5.50.42 PM (1)

Views: 12
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News