సంగారెడ్డిలో టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 18, న్యూస్ ఇండియా : ఈ రోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం అంటే, ఆలాంటి చట్టాలు తీసుకువచ్చిన అంబేడ్కర్ మహనీయుడని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గుర్తు చేశారు. సంగారెడ్డి నుండి మొదలుకొని డిల్లి వరకు దేశ ప్రజలందరూ క్షేమంగా ఉన్నరాంటే ఆనాడు చేసిన చట్టాలే కారణం అనే విషయం మరువకూడదు అని తెలియజేశారు. దేశ ప్రజలందరూ సమానత్వం సాధించాలని, స్వాతంత్ర్యంగా, స్వేచ్ఛగా, ఆర్థిక సమానత్వం ఉండాలని ఆనాడు జవహర్ లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో చట్టాలు చేశారని, ఈ రోజు ఆర్థిక స్వేచ్ఛ, భద్రత, స్వతంత్రంగా, స్వేచ్ఛ గా జీవిస్తున్నారంటే బిఅర్ఎస్ అంబేడ్కర్ గారు చేసిన రాజ్యాంగమే కారణం అని తెలియజేశారు. ఈ రోజు ప్రధాన మంత్రి గా మోడీ ఉన్నా, హోం మంత్రి గా అమిత్ షా ఉన్నా దానికి కారణం బిఅర్ అంబేడ్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కే కారణం అని తెలియజేశారు. పార్లమెంట్ లో అంబేడ్కర్ ను అవమానించేలా అమిత్ షా వ్యవహరించిన్నప్పుడు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారి నాయకుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని, అయిన ఇంతవరకు బీజేపీ నాయకులు గాని, మోడీ, అమిత్ షా లు గాని ఇంతవరకు క్షమాపణ చెప్పలేదని గుర్తుచేశారు. అంబేడ్కర్ భగవంతుడా అని పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా అవమానించాడు, అందుకు నిరసనగా రాహుల్ గాంధీ ఆధ్వర్యం లో దేశ వ్యాప్త నిరసన లను చేపట్టిందని, బీజేపీ నేతలకు సిగ్గులేదా, అంబేడ్కర్ ను అవమానిస్తారా? క్షమాపణ చెప్పారా? అంటు అమిత్ షా, మోడీ లు క్షమాపణ చెప్పేవరకు కాంగ్రెస్ పార్టీ వదలదు అని తెలియచేసారు. త్వరలో సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఏమి కోరుకుంటున్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ సహకారంతో అవన్నీ తీర్చే ప్రయత్నం చేస్తానని త్వరలో సంగారెడ్డిలో సీఎం సభ ఉంటుందని, సంగారెడ్డి ప్రజల అవసరాలు ఎంటి.? ఏం అభివృద్ది కార్యక్రమాలు జరగాలి.? అనే దానిపై త్వరలో సంగారెడ్డిలో మీటింగ్ ఏర్పాటు చేస్తానని చెప్పుకొచ్చారు. ఈ ర్యాలీ లో నిర్మలజగ్గారెడ్డి తో పాటు పలుగురు జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్దమొత్తంలో పాల్గొన్నారు.
Comment List