జెండా ఊపి హనుమాన్ శోభాయాత్రను ప్రారంభించిన: కమలానంద భారతి స్వామి..

కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవాలయం నుండి ప్రారంభమైన వీర హనుమాన్ శోభాయాత్ర...

On
జెండా ఊపి హనుమాన్ శోభాయాత్రను ప్రారంభించిన: కమలానంద భారతి స్వామి..

జెండా ఊపి హనుమాన్ శోభాయాత్రను ప్రారంభించిన: కమలానంద భారతి స్వామి..

IMG_20250412_12030699
జెండా ఊపి హనుమాన్ శోభాయాత్రను ప్రారంభించిన: కమలానంద భారతి స్వామి..

కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవాలయం నుండి ప్రారంభమైన వీర హనుమాన్ శోభాయాత్ర...

*ఎల్బీనగర్, ఏప్రిల్ 12, న్యూస్ ఇండియా ప్రతినిధి:-* కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయంలో కమలానంద భారతి స్వామి ప్రత్యేక పూజలు చేసి అనంతరం జెండా ఊపి శోభయాత్రను ప్రారంభించారు ఈ శోభయాత్ర దేవాలయం నుండి ప్రారంభమై కోటి మీదుగా ప్రధాన ర్యాలీ తో కలసి తాడ్ బండ్ వీర హనుమాన్ దేవాలయం వరకు  27 కిలోమీటర్లు
శోభయాత్ర కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛ నీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ సంఖ్యలో భద్రతను ఏర్పాటు చేశారు. హిందువులు ఐక్యత పెంపొందించడానికి దేవాలయాల వ్యవస్థను,గోమాతను రక్షించుకోవడానికి ఒక సంఘటిత శక్తిగా హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఈ శోభ యాత్ర జరుగుతుందని స్వామీజీ కమలానంద భారతి తెలిపారు. ఈ శోభాయాత్ర భాగ్యనగర్ ఒక సంస్కృతి కి ప్రతీక అని శశిధర్ తెలిపారు. దేశద్రోహులకు, మతోన్మాద వ్యక్తులకు భారతదేశంలో స్థానం లేదని శశిధర్ తెలిపారు. లక్షలాది మంది హిందూ బంధువులు వీర హనుమాన్ జయంతి శోభాయాత్రలో పాల్గొనడం ఆనందంగా ఉందని శశిధర్ అన్నారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ కార్యకర్తలు హనుమాన్ భక్తులు శోభాయాత్రలో పాల్గొన్నారు.

Views: 2

About The Author

Post Comment

Comment List

Latest News