ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి...
వనపర్తి భద్రినాద్ గుప్తా...
ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి...
వనపర్తి భద్రినాద్ గుప్తా...
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 10, న్యూస్ ఇండియా ప్రతినిధి:-

బోదకొండలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని వనపర్తి భద్రినాద్ గుప్తా అన్నారు. గత 20 సంవత్సరాల నుండి బోడకొండ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ఈసారి పక్క గ్రామాల్లో ఏర్పాటు చేయడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. బోడకొండ సెక్టార్ క్రింద అత్యధిక ధాన్యం పొందడం జరుగుతుంది. అందుకే గత ప్రభుత్వం 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఐకెపి సెంటర్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకోసం గత ప్రభుత్వం ఇక్కడ రైతు వేదిక బిల్డింగ్ కూడా కట్టించి రైతులకు అందుబాటులో ఉండే విధంగా అవకాశం కల్పించడం జరిగింది. ఈసారి కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బోడకొండ గ్రామంలో ఏర్పాటు చేయవలసిందిగా మండల వ్యవసాయ అధికారులను డిమాండ్ చేశారు. ఈ సంద్భంలో గ్రామ శాఖ అధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్, మాజీ వార్డు సభ్యులు, ఆంబోతు రమేష్, కోర్ర జహవర్ నాయక్, రమేష్ నాయక్, ప్రబాకర్ పాల్గొన్నారు.
Comment List