పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలి - సిపిఐ నిరసన...

- ఒక్క గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయలు పెంచడంతో ప్రజలకు భారం.

On
పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలి - సిపిఐ నిరసన...

- పెద్దకడుబూరు మండలంలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.

న్యూస్ ఇండియా ప్రతినిధి/ పెద్దకడుబూరు మండలం ఏప్రిల్ 08 :- మంగళవారం మండల కేంద్రమైన పెద్దకడుబూరులోని బస్టాండ్ ఆవరణంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని నిరసన సిపిఐ నాయకులు వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ నాయుడు మరియు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ మాట్లాడుతూ మాయ మాటలు చెప్పి అధికారంలో వచ్చినటువంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి ప్రజలపై కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటించడం చాలా సిగ్గుచేటుగా ఉందన్నారు. గ్యాస్ ధరలు పెంపు ఉజ్వల కనెక్షన్ కు కూడా వర్తిస్తుందని అనడం, అసలే పెరిగిన ధరలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ములిగే నక్కపై తాటి పండు పడ్డట్టు సిలిండర్ రేటు కూడా పెరగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకు ప్రస్తుతం రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ 830 ఉంటే ఇప్పుడు 880 కి చేరడంతో ఏపీలో కోటిన్నరకు పైగా యాక్టివ్ గ్యాస్ కలెక్షన్ లు ఉన్నాయన్నారు. ఆ లెక్క చొప్పున ఒక కుటుంబం ఏడాదికి 7 సిలిండర్లు వినియోగించుకుంటే 5,810 చెల్లించాలి పెరిగిన ధరలు ప్రకారము 6,160 చెల్లించాల్సి వస్తుందన్నారు. కోటిన్నర కుటుంబాలపై ఈ గ్యాస్ ధర పెంపు భారం ఏడాదికే 525 కోట్లకు పైగా భారం పడనుందని, ఇందులో కేంద్ర ప్రభుత్వాలు సబ్సిడీ కింద ఇచ్చేది మాత్రం కేవలం 10 లోపే ఉంటుంది కాబట్టి ప్రజలపై మోపినటువంటి గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని సిపిఐ పార్టీగా వారు ప్రత్యేకంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నరసింహులు, రామాంజనేయ, గూడు కాజా, నాగన్న, మూకన్నా, సద్దుల శీను, ఎర్రన్న, అల్లా బకాష్, వీరేష్, రామ్మూర్తి, నరసింహులు మరియు తదితరులు పాల్గొన్నారు...IMG-20250408-WA0268

Views: 19
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

గ్రామంలో  బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా. గ్రామంలో బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 18, న్యూస్ ఇండియా : పోతిరెడ్డిపల్లి గ్రామంలో  బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు ప్రజల...
సంగారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ లో తేదీ 21ఏప్రిల్ 2025 న జాబ్ మేళా.
సంగారెడ్డిలో టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ.
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కి ప్రత్యేక పూజలు..
బాధిత కుటుంబని పరామర్శించిన ఎమ్మెల్యే
విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాఖ్యలు చేసినా, పోస్ట్ లు పెట్టినా చట్టరిత్యా కఠిన చర్యలు తప్పవు.
సమాజంలో అందరూ సమానంగా జీవించాలన్నదే ప్రభుత్వా లక్ష్యం -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.