అగ్నివీర్ కు ఉచిత శిక్షణ...
సురక్ష సేవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కిక్కరి గోపి శంకర్ యాదవ్..
అగ్నివీర్ కు ఉచిత శిక్షణ...
సురక్ష సేవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కిక్కరి గోపి శంకర్ యాదవ్..

ఎల్బీనగర్, ఏప్రిల్ 07, న్యూస్ ఇండియా ప్రతినిధి: సురక్ష సేవ సంఘం ఆధ్వర్యంలో అగ్నివీర్ పరీక్షలకు హాజరయ్యే యువతీ యువకులకు ఉచిత శిక్షణను అందిస్తున్నట్లు సురక్ష సేవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కిక్కరి గోపి శంకర్ యాదవ్ వెల్లడించారు. ఈ సంద్భంగా విలేకల సమక్షంలో ఆయన మాట్లాడుతూ... సికింద్రాబాద్ లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ (అగ్నివీర్) కొరకు అర్హులైన అభ్యర్థుల నుండి స్వీకరిస్తున్నారు. 17.5 సంత్సరాల నుండి 21 సంత్సరాలలోపు అభ్యర్థులు ఏప్రిల్ 10వ తేది లోగా దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సురక్ష సేవ సంఘం ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సురక్ష సేవ సంఘం కార్యాలయం 7330892709 నంబర్ ను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.
Comment List