మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!

- మేకడోన గ్రామంలో మహిళపై తప్పుగా ప్రవర్తించిన వ్యక్తిపై ఎస్సి, ఎస్టీ కేసు నమోదు.

On
మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!

- బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు- ఎస్ఐ నిరంజన్ రెడ్డి వెల్లడి.

న్యూస్ ఇండియా ప్రతినిధి/ పెద్దకడుబూరు మండలం మార్చి 11 :- మండల పరిధిలోని మేకడోనా గ్రామంలో మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నిరంజన్ రెడ్డి మంగళవారం విలేకరులకు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే మండల పరిధిలోని మేకడోనా గ్రామంలో మార్చి 07-03-2025వ తేదీన ఉదయం బాధితురాలు మాదిగ భాగ్యమ్మ అదే గ్రామానికి చెందిన ఈడిగ నరసప్ప గౌడ్ యొక్క పొలంలో కూలి పనికి వెళ్ళింది. అయితే బాధితురాలు భాగ్యమ్మ నిళ్ళు త్రాగడానికి పొలంలోని వాటర్ ట్యాంకు దగ్గరకు వెళ్లగా, అదే గ్రామానికి చెందిన గొర్రెల కాపరి వడ్ల నజీర్ అనే వ్యక్తి బాధితురాలు భాగ్యమ్మను చేయి పట్టికొని ఆమె కొంగును లాగాడని, జరిగిన ఈ సంఘటనను ఆమె ఇంట్లో బాధపడుతూ కుటుంబ సభ్యులకు తెలియజేసింది. అయితే బాధితురాలు భాగ్యమ్మ తో పాటు ఆమె కుటుంబ సభ్యులు 11-03-2025 వ తేది మంగళవారం పెద్దకడుబూరు మండలంలోని పోలీస్ స్టేషన్ లో మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించిన వడ్ల నజీర్ పై ఫిర్యాదు చేసారు. బాధితురాలు భాగ్యమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, గొర్రెల కాపరి వడ్ల నజీర్ పై ఎస్సి, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నిరంజన్ రెడ్డి వెల్లడించారు. మహిళలపై ఇలా అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తులకు కఠినంగా శిక్ష పడేటట్లు చేస్తామని ఎస్ఐ తెలిపారు...IMG_20250311_213354

Views: 41
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

గ్రామంలో  బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా. గ్రామంలో బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 18, న్యూస్ ఇండియా : పోతిరెడ్డిపల్లి గ్రామంలో  బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు ప్రజల...
సంగారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ లో తేదీ 21ఏప్రిల్ 2025 న జాబ్ మేళా.
సంగారెడ్డిలో టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ.
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కి ప్రత్యేక పూజలు..
బాధిత కుటుంబని పరామర్శించిన ఎమ్మెల్యే
విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాఖ్యలు చేసినా, పోస్ట్ లు పెట్టినా చట్టరిత్యా కఠిన చర్యలు తప్పవు.
సమాజంలో అందరూ సమానంగా జీవించాలన్నదే ప్రభుత్వా లక్ష్యం -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.