ఏం తెలివి తల్లి.. వీడియో కాల్‌తో భర్తకు

కుంభమేళాలో పుణ్య స్నానం చేయించిన మహిళ

By Venkat
On
ఏం తెలివి తల్లి.. వీడియో కాల్‌తో భర్తకు

భర్తకు పుణ్య స్నానం చేయిస్తున్న మహిళ

ఆధునిక యుగంలో ఏం చేయాలన్న ఆన్‌లైన్‌లోనే. చివరికి ప్రేమలు, పెళ్లిళ్లు, పార్టీలు, లోన్లు, లీగల్‌, జాతకాలు ఇలా అన్నీ ఆన్‌లైన్‌లోనే కానిచ్చేస్తున్నారు.

 

ఇదంతా అందరికీ తెలసిందే కానీ, తాజాగా ఆన్‌లైన్‌లోనే కుంభమేళాలో పవిత్రస్నానం చేయొచ్చని నిరూపించిందో మహిళ. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లిన ఒక మహిళ కుంభామేళాకు రాకుండా ఇంటివద్దనే ఉన్న తన భర్తకు ఆన్‌లైన్‌ వేదికగా పుణ్యస్నానం చేయించింది.

 

తన ఫోన్ నుంచి భర్తకు వీడియో కాల్ చేసిన ఆ మహిళా..అలాగే తీసుకెళ్లి ఫోన్‌ను గంగ, యమున, సవస్వతీ నదులు కలిసే త్రివేణీ సంగమంలో ముంచింది. అంతేకాదు ఏకంగా మూడుసార్లు నీళ్లల్లో ముంచి పవిత్రస్నానం కానిచ్చేసింది. ఈ వీడియో చూసినవారంతా ఏం తెలివితల్లి నీది ఇలా కూడా స్నానాలు చేయొచ్చని నిన్ను చూశాకే తెలిసిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

ఇప్పటి వరకు కుంభమేళాకు సంబంధించి అనేక వీడియోలు నెట్టింట వైరల్ కాగా.. తాజాగా మరో వీడియో వైరల్ అయింది. ఇటీవలే ఓ వ్యక్తి 1100 రూపాయలు తనకు పంపిస్తే.. భక్తులకు పుణ్యస్నానాలు చేయిస్తానంటూ చెప్పాడు. ముఖ్యంగా వాట్సాప్ ద్వారా భక్తులు వారి ఫొటోలు పంపిస్తే.. వాటిని ప్రింట్ తీసి త్రివేణీ సంగమంలో ముంచి స్నానం చేయిస్తానని వివరించాడు.ఇలా చేయడం వల్ల కూడా సదరు భక్తుల పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుందని చెప్పాడు.

 

దీన్ని గుర్తించిన కొందరు అది నిజమేననుకుని తమ వెంట రాని కుటుంబ సభ్యుల ఫొటోలను నీళ్లలో ముంచుతూ కనిపించారు. మరికొందరు అయితే తమ కుటుంబ సభ్యుల పేర్లను చెబుతూ గంగలో మునిగారు. అయితే తాజాగా ఓ మహిళ ఏకంగా భర్తకు వర్చువల్ స్నానాన్నే చేయించింది. కుంభమేళాకు వెళ్లి.. అక్కడి నుంచే తన భర్తకు వీడియో కాల్ చేసింది. ఆ తర్వాత ఫోన్‌ను మూడుసార్లు నీటిలో ముంచి తీస్తూ స్నానం పూర్తయిందని చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అIMG_20250226_123122వుతుంది.

Views: 37
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News