పదవి విరమణ చేసిన సైనికుడు...

20 సంవత్సరాలుగా దేశానికి సేవ చేసిన జవాన్ కు ఘన సన్మానం..

By Ramesh
On
పదవి విరమణ చేసిన సైనికుడు...

స్వగ్రామానికి విచ్చేసిన జవాన్ బోడిగం తిరుమల్ రెడ్డి...

న్యూస్ ఇండియా తెలుగు, జనవరి 11 బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్)

 

దేశానికి సేవ చేసే అవకాశం రావడం తమ అదృష్టం అని ఆర్మీ జవాన్ బోడిగం తిరుమల్  రెడ్డి అన్నారు.దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా,త్యాగం చేసి, దేశ సరిహద్దులో విధులు నిర్వహించి విరమణ అనంతరం స్వగ్రామానికి తిరిగి వచ్చిన వీరుడికి గ్రామస్తులు పూలమాలలు వేసి ర్యాలీ నిర్వహించి, శాలువాలతో సన్మానం నిర్వహించి ఘనంగా స్వాగతం పలికారు.జనగాం జిల్లా బచ్చన్నపేట మండలంలోని ఇటికాలపల్లి  గ్రామానికి చెందిన బోడిగం చంద్రరెడ్డి పుష్ప దంపతుల కుమారుడు బోడిగం తిరుమల్ రెడ్డి గత 20 సంవత్సరాల క్రితం ఉద్యోగ రీత్యా బార్డర్ సైనికుడిగా చేరి దేశ రక్షణలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని దేశ రక్షణే ధ్యేయంగా కుటుంబాన్ని వదిలేసి, 20 సంవత్సరాలుగా ఢీల్లీ,శ్రీనగర్, జమ్మూ,పఠాన్ కొట్, ఉత్తర ఖండ్, కార్గిల్నాసిక్ వివిధ రాష్ట్రాల్లో ఏ స్వార్థం లేకుండా,దేశ ద్రోహులను గడ గడ లాడించి అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసుకొని స్వగ్రామానికి చేరుకున్నారు.

IMG20250111120836IMG20250111111606
ఈ సందర్భంగా సైనికుడు బోడిగం తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ.. సైనికుడిగావెళ్ళడానికి యువత ఎవరు కూడా సందేహించకూడదని ఒకప్పుడు తాను సైనిక ఉద్యోగానికి వెళుతున్నప్పుడు తమ తల్లి దండ్రులు చాలా భయపడి వెళ్ళవద్దు అన్నారని, దేశ రక్షణ చేయడం నా లక్ష్యం నేను ఎలాగైనా వెళతానని తిరిగి వస్తే యువతకు ఆదర్శంగా ఉంటాను, ప్రాణాలు అర్పిస్తే దేశానికి అర్పించనని గర్వంగా ఉండాలని తల్లి దండ్రులకు తెలియ జేయడం జరిగిందని తెలిపారు. దేశ రక్షణలో భాగంగా తనకు ఏ పని అప్పజెప్పినా సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల మెప్పు పొంది,ఒక సైనికుడిగా పదవీ విరమణ పొందడం ఆనందంగా ఉందన్నారు. సైనికుడిగా ఈ ప్రయాణంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.సైనికుడిగా పదవి విరమణ పొంది వచ్చిన నన్ను ఇంత అభిమానంగా సన్మానించిన గ్రామస్థులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.IMG20250111111302

Read More ఏడుగురు పేకాటరాయిలు అరెస్ట్..

Views: 528
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News