జన జాతీయ గౌరవ దివాస్

On
జన జాతీయ గౌరవ దివాస్

ఖమ్మం నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో, కెసిఆర్ నగర్ యూత్ క్లబ్ వారు జన జాతీయ గౌరవ దివాస్ కార్యక్రమాన్ని ఖమ్మం ఇంటర్మీడియట్ బీసీ వెల్ఫేర్ కాలేజీలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ క్లబ్ మురళీకృష్ణ, ప్రిన్సిపాల్ నాగమణి, ఇన్చార్జి సుకన్య, పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్ సయ్యద్ షారుక్ ఇమ్రాన్ మరియు ఉపేందర్, బిర్సా ముండా గారి చిత్రపటానికి ముందుగా పూలమాల వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ తరువాత యువతకు బిర్సా ముండా (1875–1900) లేదా బిర్సా భగవాన్, భారతీయ అటవీ జాతుల స్వాతంత్ర్య సమరయోధుడు, జానపద నాయకుడు. ఇతడు ముండా జాతికి చెందినవాడు.19వ శతాబ్దపు చివరి రోజుల్లో, నేటి బీహార్, ఝార్ఖండ్ ఆటవిక ప్రాంతాల్లో, బ్రిటిషు కాలంలో జరిగిన మిలీనేరియన్ ఉద్యమానికి సారథ్యం వహించాడు. 22 ఏళ్ల వయసు ( 1897) లోనే బ్రిటీషర్లపై యుద్ధం ప్రకటించారు, తద్వారా భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయాడు. ఇతడి గౌరవార్థం భారత పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో ఈయన చిత్రపటం ఉంది. ఈ విధంగా సత్కరింపబడిన ఏకైక ఆటవిక జాతుల నాయకుడు బిర్సా ముండా. బ్రిటిషు వలసవాదంపై తిరుగుబాటుగా సాగిన భారతీయ స్వాత్రంత్ర్య పోరాటంలో పాల్గొన్న యోధునిగా బిర్సా ముండా పేరును అత్యంత గౌరవంతో ప్రస్తావిస్తారు. కనీసం పాతికేళ్లు కూడా దాటకుండానే ఇవన్నీ సాధించడం వల్ల ఈయన ఘనత మరింత ఉత్కృష్టమైనది. భగవాన్ బిర్సా ముండా గారి యొక్క గొప్పతనం గురించి అవగాహన ఇచ్చి అనంతరం మొక్కలను నాటించి విద్యార్థులతో ర్యాలీ తీయించడం జరిగింది.

Views: 9
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List