మాదక ద్రవ్యాల  నియంత్రణపై అవగాహన సదస్సు

On
మాదక ద్రవ్యాల  నియంత్రణపై అవగాహన సదస్సు

ఖమ్మం నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్ వారు నగరంలోని స్థానిక గట్టయ్య సెంటర్ ఉపేంద్ర నగర్ లో గల కవిత డిగ్రీ మరియు పీజీ కళాశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్య వ్యాసనం, మాదక ద్రవ్య దుర్వినియోగం నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, ఎక్సైజ్ శాఖ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా యాంటీ నార్కోటిక్స్  బ్యూరో సర్కిల్ ఇన్ స్పెక్టర్ రాము మాట్లాడుతూ డ్రగ్స్ కు అలవాటు అవుతున్న వారిలో చాలామంది విద్యార్థులే ఉంటున్నారని ఇది వారి భవిష్యత్తును చాలా దెబ్బతీస్తుంది అన్నారు. అంతేకాకుండా మాదకద్రవ్యాలకు అలవాటు పడిన వారు తమకు పట్టుపడితే శిక్ష కఠినంగా ఉంటుందని కాబట్టి విద్యార్థులు మాదక ద్రవ్యాల పట్ల అప్రమత్తతో ఉండాలని విద్యార్థులకు సూచించారు.

 ఎక్సైజ్    ఇన్ స్పెక్టర్ జయశ్రీ మాట్లాడుతూ మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నట్టు తెలిస్తే  తమకు సమాచారం ఇవ్వొచ్చని అలాంటి వారిపై  ఎక్సైజ్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులతో మాదక దవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కవిత  కళాశాలల కరస్పాండెంట్ పారుపల్లి ఉషా కిరణ్, కవిత డిగ్రీ కళాశాల  డాక్టర్ సిహెచ్ రాధాకృష్ణమూర్తి, కవిత పిజి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పారుపల్లి రాజా రాణి, నెహ్రూ యువ కేంద్రం అకౌంట్స్ మరియు ప్రోగ్రాం ఆఫీసర్ కె భానుచందర్ , కళాశాల అకాడమిక్ కోఆర్డినేటర్ పి శ్రీనివాసరావు, కళాశాల బయోటెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్ పవన్ కుమార్, యాంటీ నార్కోటిక్స్ సిబ్బంది, ఎక్సైజ్  సిబ్బంది,కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది  మరియు కళాశాలఏన్ సి సి  క్యాడేట్స్,ఏన్ ఎస్ ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

Views: 2
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News