ఇటికాలపల్లిలో స్వచ్ఛమైన ఈత కల్లు లభ్యం...
- గౌడ సంఘం అధ్యక్షులు దూడల రమేష్ గౌడ్...
By Ramesh
On
న్యూస్ ఇండియా తెలుగు, నవంబర్ 12 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్)
జనగామ నియోజకవర్గం బచ్చన్నపేట మండలంలోని ఇటికాలపల్లి గ్రామంలో స్వచ్ఛమైన ఈత కల్లు లభ్యం అవుతున్నట్లు గౌడ సంఘం అధ్యక్షులు దూడల రమేష్ గౌడ్ తెలిపారు.చెట్ల ద్వారా ప్రకృతి ప్రసాదించే కల్లు తాగడం ద్వారా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.. ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుందన్నారు.ఈత కల్లు కొంచెం తీపిగా, మృదువుగా ఉంటుందని,ఈత కల్లులో సహజమైన ఎంజైములు, ప్రొబయోటిక్స్ ఉంటాయని, ఇవి జీర్ణవ్యవస్థకు సహాయపడతాయని తెలిపారు.ప్రతి రోజు ఉదయాన్నే 8 గంటల వరకు వచ్చి కల్లు తీసి 2 లీ. రూ.100 చోప్పున అమ్ముతున్నట్లు తెలిపారు.డన్నలు చెక్కిల్ల కిష్టయ్య,దూడల బాలయ్య,బత్తిని వెంకటేష్,సుద్దల సిద్దులు,నేరేళ్ళ పర్షరాములు,నేరేళ్ళ సత్తయ్య,బైరగోనీ చిన్న ఓజేల్ ఉన్నారు.
Read More ఘనంగా క్రిస్మస్ గాస్పల్ వేడుక
Views: 3
Tags:
Comment List