ఇబ్ర‌హీంప‌ట్నంలో...! ఇష్టారీతిన వసూళ్లు...!!

స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యంలో అవినీతి దందా..-

On
ఇబ్ర‌హీంప‌ట్నంలో...! ఇష్టారీతిన వసూళ్లు...!!

ఇబ్ర‌హీంప‌ట్నంలో...
ఇష్టారీతిన వసూళ్లు...

స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యంలో అవినీతి దందా..-

Screenshot_2024-11-09-21-27-13-55_680d03679600f7af0b4c700c6b270fe7
ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ కార్యాలయం..

ప్ర‌తి ఫైల్‌కు రేట్ ఫిక్స్ చేసిన కార్యాల‌య సిబ్బంది..-

మ‌ధ్య‌వ‌ర్తులుగా డాక్యుమెంట్ రైట‌ర్స్..-

Read More టై,బెల్ట్,ఐడికార్డ్స్, డ్రం సెట్  లను అందజేసిన భరత్

సీనియ‌ర్ అసిస్టెంట్ సోనికి ఇన్‌చార్జ్ ఎస్ఆర్ఓగా బాధ్య‌త‌లు..

Read More బేతంచెర్ల ప్రాథమికపాఠశాలలో బాలల దినోత్సవం

ఈ నియామ‌కం వ‌సూళ్ల కోస‌మంటున్న స్థానిక ప్ర‌జ‌లు..-

Read More  తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టరేట్ అవార్డు అందుకున్న పసుపులేటి సుజాత

గతంలో 9చోట్ల ఎస్ఆర్ఓగా విధులు నిర్వ‌ర్తించిన సీనియ‌ర్ అసిస్టెంట్‌..

ఎస్ఆర్ఓ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంలో మ‌ర్మ‌మేంటి..?

ఇన్‌చార్జ్‌గా ఏ ఎస్ఆర్ఓ నైనా నియ‌మించ‌వ‌చ్చు క‌దా..?

ఇబ్రహీంపట్నం, నవంబర్ 09 (న్యూస్ ఇండియా ప్రతినిధి): మన దేశంలో అడుగడుగునా లంచం.. మున్సిపాలిటీ నీళ్లు రావాడానికి లంచం, ఇల్లు కట్టడానికి లంచం, కరెంట్ ఇవ్వడానికి లంచం, రేషన్ కార్డుకు లంచం, రైతులకు రుణాలు ఇవ్వాలంటే లంచం, హాస్పిటల్ లో బెడ్ కు లంచం, ఆడపడుచు ఆపరేషన్ లేకుండా సుఖంగా ప్రసవించాలంటే లంచం, బర్త్ సర్టిఫికేట్ కు లంచం, డెత్ సర్టిఫికెట్ కు లంచం, మనిషి పుట్టిన దగ్గర నుంచి  చచ్చిన దాకా లంచం లంచం లంచం..  ఈ డైలాగ్ ఓ చిత్రం కోసం కవి రాసింది. నిజంగానే ప్రస్తుతం సమాజంలో ఇదే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఓ సామాన్యుడు... పని కోసం ఏ ప్రభుత్వ కార్యాలయానికి పోయినా అక్కడ లంచం అనే మాట వినపడనిదే ఉండదంటే అతిశయోక్తి కాదు. ఓ గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు ఎక్కడ చూసిన లంచం. 'అన్నం పెట్టే వాడికన్నా సున్నం పెట్టే వాళ్లే ఎక్కువ' అన్నట్టు ఆయా డిపార్ట్ మెంట్లల్లో అవినీతి అధికారులు రోజు రోజుకు ఎక్కువై పోతున్నరు. నిత్యం ఏదో చోట లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరుకుతున్నా ప్రభుత్వ పెద్దలకు ఏ మాత్రం పట్టడం లేదు.

వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి దందా కొనసాగుతుంది. సబ్ రిజిస్ట్రార్ గా ఓ అవినీతి అధికారికి బాధ్యతలు ఇచ్చారు. గతంలో 9 ప్రాంతాల్లో ఎస్ఆర్ఓ గా పనిచేసిన సీనియ‌ర్ అసిస్టెంట్‌ సోనిని ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ గా నియమించడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. స‌మీపంలో విధులు నిర్వ‌ర్తిస్తున్న ఎస్ఆర్ఓకు ఇబ్ర‌హీంప‌ట్నం ఇన్‌చార్జ్ ఎస్ఆర్ఓగా ఇవ్వ‌కుండా వేరే ప్రాంతంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ సోనిని ఇక్కడ ఎస్ఆర్ఓగా నియమించడంపై ఆంతర్యమేంటో ఎవరికీ పాలుపోవడం లేదు. ఇప్పటికే ఆమె పనిచేసిన చోట్లల్లో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాంటి అవినీతి అధికారినీ ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ గా బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు చేస్తున్నారు. 

మరోవైపు ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అనేక అవినీతి, అక్రమాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రతి ఫైల్ కు ఓ రేట్ ఫిక్స్ చేస్తూ కార్యాలయ సిబ్బంది పైసలు దండుకుంటున్నట్లు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. స్వయంగా డాక్యుమెంట్ రైటర్స్ మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ రిజిస్ట్రార్ ఆఫీస్ లో మాముళ్లు ముట్టచెబుతూ పనిచేసుకుంటున్నట్లు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా ఎక్కడో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సోనిని ఇక్కడ ఎస్ఆర్ఓగా నియమించడంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అవినీతి, అక్రమాలు కొనసాగించేందుకు ఈమెను ఇబ్రహీంపట్నం ఎస్ఆర్ఓగా నియమించినట్లు తెలుస్తోంది. వసూళ్ల కోసమే సబ్ రిజిస్ట్రార్ గా నియమించినట్లు ప్రచారం అవుతుంది. 

రాష్ట్రంలో రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్, జీహెచ్ఎంసీ, మున్సిపల్ శాఖలు అత్యంత అవినీతిమయంగా మారిపోయాయి. ఎంత మంది అధికారులు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు దొరికిన కేవలం సస్పెండ్ మాత్రం చేస్తూ, వాళ్లపై మరేలాంటి చర్యలు తీసుకోకుండా ఉండడం వల్ల ఇతర అధికారులు అవినీతికి పాల్పడేందుకు భయపడడం లేదని చర్చ జరుగుతుంది. ప్ర‌భుత్వం ఇలాంటి వాటిపై కఠిన నిర్ణయాలు తీసుకొని వారిని పర్మినెంట్ గా సర్వీసు నుంచి రిమూవ్ చేయడంతోపాటు జైలు శిక్ష విధిస్తే తప్ప అవినీతి జరగకుండా చూడలేమని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు.

Views: 2

About The Author

Post Comment

Comment List

Latest News

 తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టరేట్ అవార్డు అందుకున్న పసుపులేటి సుజాత తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టరేట్ అవార్డు అందుకున్న పసుపులేటి సుజాత
న్యూస్ ఇండియా తెలుగు,నవంబర్ 17( నల్గొండ జిల్లా ప్రతినిధి):తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల లోనీ...
ముగ్గురిని వరించిన పదవులు
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ను సన్మానించిన కనకాల శివాజీ కురుమ..
శ్రీ నాగార్జున స్కూల్లో దారుణం ..
నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబానికి స్పందించిన హృదయాలు...
జన జాతీయ గౌరవ దివాస్
జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామం లో మత్స్య సొసైటి సహకార సంఘం ఆధ్వర్యంలో చేప పిల్లల పంపిణీ