బమ్మెరలో నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులకు ఘన సన్మానం
బమ్మెర పోతన గ్రంథాలయం & పోతన సాహిత్య కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో
సన్మాన గ్రహీతలు
తేదీ 01/ 11 /2024 రోజున బమ్మెర పోతన గ్రంథాలయం ఆవరణలో డీఎస్సీ 2024 లో ఎంపికైన నూతన ఉపాధ్యాయులకు ఘన సన్మానం.
*సన్మాన గ్రహీతలు*
దేవసాని ఉపేందర్ (తెలుగు భాష ఉపాధ్యాయుడు)
మాచర్ల సుస్మిత ( వ్యాయామ ఉపాధ్యాయురాలు )
కొంగ సురేష్( సెకండరీ గ్రేడ్ టీచర్ )
ఈ సన్మాన కార్యక్రమానికి పోతన సాహిత్య కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు మాన్యపు బుజేందర్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా విచ్చేసిన వారు గ్రామ పంచాయతీ కార్యదర్శి మట్టపల్లి యుగంధర్, పోతన గ్రంథాలయ స్థాపకులు పెంతల అశోక్( పి సి),
సుదర్శన చారి, ( బిజెపి మండల ప్రధాన కార్యదర్శి ) మారం రవికుమార్, (గ్రామ కారోబార్) బొంకురి కిష్టయ్య, (యువజన నాయకుడు )జంపాల రాజు, (సంఘసేవకుడు) దేవసాని నరేష్,
గ్రామస్తులు బత్తిని శ్రీనివాస్, రాపోలు సోమేశ్వర్ దంపతులు, దేవసాని రాజు, పెంతల సోమన్న,
గాదె రామచంద్రం, బత్తిని పరశురాములు (ఫీల్డ్ అసిస్టెంట్ )
పాల్గొని ఘనంగా సన్మానించి, సన్మాన గ్రహీతలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ, నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులు బమ్మెర గ్రామానికి మంచి పేరుతేవాలని, వీరి ఉపాధ్యాయ వృత్తిలో విద్యార్థినీ విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేరుకునేలా విద్యా బోధన చేయాలని, బమ్మెర పోతన పద్యాలను విద్యార్థులకు కంఠస్థo చేయించాలని, ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎదగాలని వీరు ఆకాంక్షించారు. ఇంకా వారు మాట్లాడుతూ గ్రామ గ్రంథాలయాన్ని యువతీ యువకులు వినియోగించుకొని ఈ ముగ్గురి లాగా వారు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.
నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులు మాట్లాడుతూ చరిత్ర కలిగిన బమ్మెర గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చేలా కృషి చేస్తామని, విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు.
Comment List