క్రిమిసంహారక మందు సేవించి వ్యక్తి మృతి

క్రిమిసంహారక మందు సేవించి వ్యక్తి మృతి

క్రిమిసంహారకమందు సేవించి వ్యక్తి వ్యక్తి మృతి చెందిన ఘటన వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం మండలంలోని పులిగిల్ల గ్రామానికి చెందిన రూపని సత్తయ్య (56) వరి కోత మిషన్ కొనుగోలు చేసి నడిపిస్తూ జీవనం కొనసాగిస్తుంటాడు. వరి కోత మిషన్ కోసం శ్రీరామ్ ఫైనాన్స్ మోత్కూరు నందు రుణము పొంది బండి నడవకపోవడంతో సకాలంలో నెలవారికిస్తులు చెల్లించకపోవడంతో శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ వారు, వారి ఏజెంట్లు ఇతడిని వేధించి హార్వెస్టర్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనితో తీవ్ర మనస్తాపం చెందిన సత్తయ్య గురువారం రోజున గడ్డి మందు సేవించి హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రోజున మృతి చెందడం జరిగింది. మృతుని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వలిగొండ ఎస్సై యుగేందర్ గౌడ్ తెలిపారు.IMG-20240914-WA0883

Views: 312

Post Comment

Comment List

Latest News