ఐదు రోజులు భారీ వర్ష సూచన

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ జితేష్ వి పాటిల్

On
ఐదు రోజులు భారీ వర్ష సూచన

భద్రాద్రి (న్యూస్ ఇండియా) ఆగస్టు 31:వాతావరణ శాఖ సమాచారం ప్రకారం 31-08-24 శనివారం నుండి బుధవారం04- 09 -24 వరకు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పట్టణ పంచాయతీ మరియు గ్రామ పరిధిలోని. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, సుదూర ప్రాంత ప్రయాణాలు చేయరాదని, ప్రజలు ప్రయాణించే మార్గంలో వాగులు వంకలు దాటరాదని, గ్రామీణ ప్రాంతంలోని మట్టి గోడల ఇల్లు, పాకలలో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. జిల్లా అధికారులందరూ సమైక్యంగా పనిచేసే ఎటువంటి నష్టం కలగకుండా తమ వంతు బాధ్యతలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

Views: 68
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News