గణపతి నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలి...
- బచ్చన్నపేట ఎస్సై కంకల సతీష్...
న్యూస్ ఇండియా తెలుగు,ఆగష్టు 29 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్)
గణపతి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా బచ్చన్నపేట ఎస్సై కంకల సతీష్ గణపతి ఉత్సవ కమిటీ నిర్వాహకులతో గురువారం రోజున సమావేశం నిర్వహించారు.గణపతి నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలని,గణపతి మండపం ఏర్పాటు చేసే వారు కచ్చితంగా పోలీసుల శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని,గణపతి మండపాల దగ్గర ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే సౌండ్ బాక్సులు వినియోగించాలని సూచించారు.గణపతి విగ్రహాలను రహదారులపై ఏర్పాటు చేయకూడదని,బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టి ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగించకూడదని సూచించారు. హుండీలు, విలువైన వస్తువులు ఉన్న చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని,డిజేలకు అనుమతి లేదని,మండపాల దగ్గర సౌండ్ బాక్సులు కూడా నిర్ణీత సమయంలోనే ఉపయోగించాలని సూచించారు.విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా అధికారిక కనెక్షన్ తీసుకోవాలని, అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఆయా ఉత్సవ కమిటీ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు.ఏదైనా సమాచారం కోసం డయల్ 100 లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలని సూచించారు.
Comment List