హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా జెండా ఆవిష్కరణ...
స్వతంత్రం ఆనాటి అమరుల త్యాగాల ప్రతిఫలం..
కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్...
ఎల్బీనగర్, ఆగస్టు 14 (న్యూస్ ఇండియా ప్రతినిధి): ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు, హర్ ఘర్ తిరంగా అభియాన్
లో భాగంగా కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్ వారి ఇంటిపైన, కార్పొరేటర్ కార్యలయం పైన నాయకులతో కలిసి జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది. అనంతరం వందల సంవత్సరాలుగా లక్షలాదిమంది భారతమాత ముద్దుబిడ్డలు, నా దేశానికి స్వేచ్ఛ కావాలని, స్వతంత్రం రావాలని, పరాయి పాలకుల పీడ పోవాలని ఎంతోమంది అమరులయ్యారు.
77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనందరం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వతంత్రం ఆనాటి అమరుల త్యాగాల ప్రతిఫలమని మనం మర్చిపోతున్నాం. ఈ దేశం ప్రపంచంలోనే ప్రజాస్వామిక విలువలతో, స్ఫూర్తితో ప్రపంచ దేశాలకు ఆదర్శవంతంగా నిలుస్తున్న దేశం భారతదేశం. ఇంత గొప్ప సంస్కృతిని, సాంప్రదాయాన్ని, మన స్వతంత్ర భారతదేశ గొప్పతనాన్ని చాటి చెప్పే గొప్ప సన్నివేశమే "హర్ ఘర్ తిరంగా" కాబట్టి దీన్ని కాపాడుకోవాలని తెలియజేస్తూ, ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు.
Comment List