జనక్ ప్రసాద్ పుట్టినరోజును ఘనంగా నిర్వహించిన ఐఎన్టియుసి నాయకులు
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ
ఐఎన్టియుసి కార్యాలయంలో ఘనంగా కేక్ కటింగ్
కొత్తగూడెం (న్యూస్ ఇండియా బ్యూరో నరేష్) ఆగస్టు 13: ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ మినిమం వేజ్ బోర్డు అడ్వైజరీ బోర్డు చైర్మన్, పర్మినెంట్ వేజ్ బోర్డ్ మెంబర్ జన ప్రసాద్ 72వ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం కొత్తగూడెంలో ఐఎన్టియుసి నాయకులు ఘనంగా జన్మదిన వేడుక నిర్వహించారు. జనరల్ సెక్రెటరీ త్యాగరాజన్, కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఐఎన్టియుసి కార్యాలయంలో కేక్ కటింగ్ చేసి పుట్టినరోజు వేడుక ఘనంగా నిర్వహించారు. జనక్ ప్రసాద్ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఐఎన్టీయూసీ నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ త్యాగరాజన్ ,సెంట్రల్ కమిటీ మెంబర్ ఆల్బర్ట్, సెంట్రల్ కమిటీ మెంబర్ అభిషేక్, బ్రాంచి సెక్రెటరీలు మహేష్, లలిత లక్ష్మి, రాజేశ్వరరావు, ఛీప్ ఆర్గనైజర్ సెక్రెటరీ తిరుపతి రావు, మెయిన్ వర్క్ షాప్ పిట్ సెక్రటరీ జి.రమేష్, మెయిన్ హాస్పిటల్ ఫిట్ సెక్రెటరీ సురేందర్, కాంగ్రెస్ నాయకులు మధుసూదన్ రావు (చిన్ని), ఐఎన్టియుసి నాయకులు నాగిరెడ్డి, అసిస్టెంట్ ఫిట్ సెక్రెటరీ సివిల్ మధు, జె శ్రీనివాస్, వలస కుమార్, హెడ్ ఆఫీస్ ఫిట్ సెక్రెటరీ సంజిత్, ఐఎన్టియుసి మహిళా నాయకురాలు హేమరెడ్డి ,స్వప్న రెడ్డి ,విజయలక్ష్మి, సుధాకర్, ఎస్.రాజేశ్వరరావు, సివిల్ డిపార్ట్మెంట్ సత్యనారాయణ ఎస్&పిసి పిట్ సెక్రెటరీ జల్లరపు శ్రీనివాస్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Comment List