ఉత్తమ సింగరేణి కార్మికులు వీరే
పంద్రాగస్టు నాడు సీఎండీ చేతుల మీదుగా సన్మానం
78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భముగా కొత్తగూడెం ఏరియాలో ఎంపిక అయిన ఉత్తమ సింగరేణియన్ మరియు ఉత్తమ కార్మికులు వీరే
కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్) 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కొత్తగూడెం ఏరియాకు గాను ఉత్తమ సింగరేణియన్ గా అయినవేల్లి శ్రీనివాసరావు, ఫిట్టర్, కిష్టారం ఓసి మరియు ఉత్తమ కార్మికులుగా 1) పాటర్లపాటి విజయ్ భాస్కర్, ఫిట్టర్, పద్మావతిఖని, 2) కున్సోత్ రామచందర్, కోల్ కట్టర్, పద్మావతిఖని, 3) జి. బాలసుబ్రమణ్యం, ఎలక్ట్రీషియన్, జేవిఆర్ ఓసి, 4) ఎం. వెంకటేశ్వర్ చారి, ఈపి ఆపరేటర్, జేవిఆర్ ఓసి,5) బొక్క శ్రీనివాస్, ఈపి ఆపరేటర్, కిష్టారం ఓసి 6) ఆవునూరు రాజేశ్వరరావు, జనరల్ మజ్దూర్, కిష్టారం ఓసి, 7) ఎం. సురేందర్, కన్వేయర్ ఆపరేటర్, ఆర్.సి.హెచ్.పి 8) ఎరవెల్లి నగేష్ జనరల్ మజ్దూర్, జేవిఆర్ సిహెచ్‌పి ఎంపిక చేయడం జరిగింది. వీరిలో ఉత్తమ సింగరేణియన్ గా ఎంపిక అయిన అయినవేల్లి శ్రీనివాసరావు, ఫిట్టర్ కి సింగరేణి కార్పొరేట్ సెంట్రల్ ఫంక్షన్ లో జరుగు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో సింగరేణి కాలరీస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్చే సన్మానం జరుపబడును. అలాగే ఉత్తమ కార్మికులుగా ఎంపిక చేయబడిన వారికి ఆగస్టు15న రుద్రంపూర్ ప్రొ.జయశంకర్ గ్రౌండ్స్ నందు ఉదయం 09.00గంటలకు జరుగు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం చేతుల మీదుగా సన్మానం జరుగును.
Comment List