తొర్రూరు లో దొంగల బీభత్సం మెయిన్ రోడ్డు షాపులె టార్గెట్...

తొర్రూరు డిఎస్పి సురేష్ బాబు... ఎస్సై రాంజీ నాయక్....

తొర్రూరు లో దొంగల బీభత్సం  మెయిన్ రోడ్డు షాపులె టార్గెట్...

*తొర్రూరు లో దొంగల బీభత్సం*
 *మెయిన్ రోడ్డు షాపులె టార్గెట్...
•ఒకేసారి రెండు షాపులో దొంగతనం...
•ఒక్క షాప్ లో సిగరెట్లు చోరీ...మరొక్క షాపులో బట్టలు చోరీ..

*తొర్రూరు డిఎస్పి సురేష్ బాబు... ఎస్ఐ రాంజీ నాయక్IMG_20240810_140723 *

మెయిన్ రోడ్డులో ఒకేసారి రెండు షాపుల్లో దొంగలు పడ్డ సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం భవాని జనరల్ స్టోర్ మరియు పద్మావతి క్లాత్ స్టోర్ రెండు షాపులలో ఒక్కసారిగా ఇద్దరు దొంగలు ముసుగులు వేసుకొని చోరికి పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి పొడవాటి గుణపం లాంటి కట్టర్ తో షాప్ తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న తొర్రూరు డిఎస్పీ సురేష్ బాబు,ఎస్సై రాంజీ నాయక్, రెండు షాపులను సందర్శించిన వెంటనే క్లూస్ టీమ్ ను పంపించి వివరాలు సేకరిస్తున్నారు.ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్సై రాంజీ నాయక్ తెలిపారు.  

*సిగరెట్ డబ్బాలు దొంగతనం చేశారు*
*సెల్ సింగ్ భవాని జనరల్ స్టోర్ యజమాని*

Read More సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన బోనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

శుక్రవారం రాత్రి 9 గంటలకు భవాని జనరల్ స్టోర్ షాప్ కు తాళాలు వేసి వెళ్లిపోయాము. శనివారం రోజున షాపు తెరవడానికి వచ్చి చూడగానే శేటర్ యొక్క తాళాలు పగలగొట్టి ఉన్నాయి.దీంతో షాప్ లో ఏమైనా పోయాయని చూసుకున్నాము. కానీ అంత విలువైన వస్తువులు ఏమి పోలేదు కానీ సిగరెట్ డబ్బాలు మాత్రం అధికంగా చోరీకి పాల్పడ్డారు.అదేవిధంగా గళ్ళలోని ₹10 కాయిన్స్ కూడా తీసుకువెళ్లారు,వాటితో పాటు సీసీ కెమెరా డివిఆర్ బాక్స్ కూడా దొంగలించారని తెలిపారు.

Read More  ఘనంగా క్రిస్మస్ గాస్పల్ వేడుక

*సెల్ సింగ్ భవాని జనరల్ స్టోర్ యజమాని*

*పద్మావతి బట్టల షాపులో చోరీ*
*కందకట్ల గోపి,పద్మావతి క్లాత్ స్టోర్ యజమాని*

పద్మావతి బట్టల షాపులో అధికంగా బట్టలు దొంగలించారని షాపు యజమాని వాపొయ్యారు.శనివారం ఉదయం షాప్ ఓపెన్ చేస్తామని చూడగానే షాప్ తాళాలు పగలగొట్టి షాపులో నుండి బట్టలు సంచులు దొంగలించారు. వెంటనే సీసీ కెమెరాలు చూడగా శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ఇద్దరు వ్యక్తులు ముసుగులు వేసుకొని దొంగతనానికి పాల్పడ్డారు.షాపులో నుండి సుమారుగా 60 వేల నుండి 70 వేయిల వరకు బట్టలు దొంగళించారు.వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందవేశము.

Views: 428
Tags:

Related Posts

Post Comment

Comment List