లక్ష్మీదేవిపల్లి మండలం ప్రజా పరిషత్ వీడ్కోల సమావేశం

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కూనంనేని

On

లక్ష్మీదేవిపల్లి(న్యూస్ఇండియా)ఆగస్టు9:లక్ష్మీదేవిపల్లి మండలం ప్రజా పరిషత్ లొని సభ్యుల పదవి కాలం ఆగస్టు 6తో ముగియడంతో శుక్రవారం వీడ్కోల కార్యక్రమం నిర్వహించారు.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు పరిపాలన అందించిన జడ్పిటిసి ఎంపీటీసీలు పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలకు ఎప్పుడు మీ సేవలు ఉండాలన్నారు. ప్రశాంత జీవితం గడపండి, అవకాశం వస్తే మళ్లీ రాజకీయాలు రాణించండి, అవకాశం రాకపోతే గ్రామానికి సేవ  అందించడి ఆని తెలిపారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే కూనంనేనిIMG20240809155143 సాంబశివరావు ఎంపీటీసీలును శాలువాతో సన్మానించి , జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా, సొసైటీ చైర్మన్ మండే వీరహనుమంతరావు, ఎంపీడీవో చలపతిరావు, ఎంపీపీ భూక్యా సోనా , ఎమ్మార్వో కె ఆర్ కె వి ప్రసాద్,   జెడ్పిటిసి మేరెడ్డి వసంత , మండల కో ఆప్షన్స్ సభ్యులు జక్కుల సుందర్, భూక్యా స్వాతి, కొమరం లలిత, ముక్కెర శిరీష, నునావత్ గోవింద్, తేజావత్ భద్రమ్మ, గుర్రాల బాబురావు, కుంజ రాంబాబు సూపర్డెంట్ టీ. అంకుబాబు , ఏఈలు వెంకటస్వామి, శివ లాల్ ,మండల కార్యదర్శిలు తదితరులు పాల్గొన్నారు.

Views: 44
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News