భూదాన భూముల్లో ప్రొసీడింగ్స్ ఆర్డర్స్ ను పొందిన పేదలందరికీ వెంటనే పక్కాగృహాలు నిర్మించి ఇవ్వాలి.-
సిపిఐ ఎం.ఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ గడ్డం సదానందం..
భూదాన భూముల్లో ప్రొసీడింగ్స్ ఆర్డర్స్ ను పొందిన పేదలందరికీ వెంటనే పక్కాగృహాలు నిర్మించి ఇవ్వాలి.-సిపిఐ ఎం.ఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ గడ్డం సదానందం..
ఎల్బీనగర్, ఆగస్ట్ 06 (న్యూస్ ఇండియా ప్రతినిధి): తారామతిపేట సర్వే నెంబర్ 235, 236 లలోని భూధాన భూముల్లో భూధాన యగ్న బోర్డు నుండి 2014లో ప్రొసిడింగ్ ఆర్డర్స్ ను పొందిన పేదలందరికి వెటనే పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నేడు అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్, జాయింట్ కలెక్టర్ లకు వినతి పత్రం సమర్పించటం జరిగింది. సిపిఐ ఎంఎల్+మాస్ లైన్) రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ముద్దగౌని రాజ్యలక్ష్మి, జిల్లా నాయకురాలు ఎస్.ఎల్.పద్మ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం సదానందం, పివైఎల్ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్, క్రిష్ణ, పిడిఎస్ యు, పివోడబ్ల్యూ రమ్య, భూదాన ప్రొసీడింగ్ ఆర్డర్ గ్రహీతలు పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ... స్వంత ఇండ్లు లేని పేదలు గత 20 సంవ్సరాలుగా అద్దె ఇండ్లల్లో నివశిస్తున్నారు. రోజు కూలితో వచ్చే జీతంతో పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో కుటుంబ పోషణే కష్టమౌతున్న పరిస్థితుల్లో, స్వంత ఇండ్లు లేక కిరాయి ఇంటి అద్దెలను చెల్లించలేని పేదలు దుర్బర జీవితాలను గడుపుతున్నారని. ఇండ్లు లేని పేదలందరికి స్వంత ఇంటి కలను నిజం చేస్తామన్న గత ప్రభుత్వాల వాగ్దానాలు అమలుకు నోచుకోలేదన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పేదల జీవితాలేమైన మారి, కనీసం స్వంత ఇంటి కలయినా నెరవేరుతుందనే ఆశతో పోరాడి సాధించుకున్న తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి KCR పేదలందరికి 125 గజాల స్థలంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టిస్తామని వాగ్దానం చేశారు. కాగా పట్టణ పేదలందరూ తమ స్వంత ఇంటి సమస్యను పరిష్కరించి, పట్టణానికి దగ్గరలో ఉండి, పని చేసుకొని బ్రతికేందుకు వీలుగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని, అనేకసార్లు కార్యాలయాల చుట్టూ తిరిగి, మొరపెట్టుకున్నారు. పేదల స్వంత ఇంటి కల నెరవేరలేదు. తీరని కలగానే మిగిలి పోయింది. తెరాస ప్రభుత్వం పట్టించుకోనందున భూదాన భూముల్లో ఇంటి స్థలాలను కేటియించాలని పేదలు చేసిన ఆందోళ నతో-పేదల ఆవేదనను అర్ధం చేసుకున్న భూదాన బోర్డు వారు రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ (మం) తారామతిపేటలోని భూధాన భూమి సర్వేనెంబర్ 235, 236 లలో 650 పేద కుటుంబాలకు 100 గజాల చొప్పున ఇంటి స్థలాలను కల్పిచి, ప్రొసిడింగ్ ఆర్డర్స్ ను ఇచ్చారు. అట్టి పేద కుటుంబాలు తమకు “డి”ఫాం” పట్టాలనిచ్చి, పక్కా గృహాలను కట్టించాలని మండల తహశీల్దార్, జిల్లా కలెక్టర్ లకు ఎన్నోసార్లు మొరపెట్టుకోవడం జరిగింది. చివరకు తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరి కార్యాలయం నుండి 635మంది పేర్లు, వివరాలతో కూడిన లెటర్ ను ది: 09-01-2015 మెమో నెం: 10811/ASN.1(1) 2014-1ను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తేది 13-01-2015 న పంపించారు. అయినప్పటికీ ఇండ్లు కట్టుకోవవడానికి అనుమతించలేదు. అంతేగాకుండా భూదాన బోర్డు ఇచ్చిన స్థలాల్లో కూడా స్వంత ఇండ్లు కట్టుకోనివ్వకుండా పేదలకు తీవ్ర అన్యాయం చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం. తెలగాణరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కి కూడా ది : 05-01-2015న వివరాలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించామని దాంతో వారు తిరిగి వ్రాసిచ్చిన లేకను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ది:13-01-2015న రాష్ట్ర మంత్రులకు కూడా సమర్పించడం జరిగిందని తెలిపారు. హయత్ నగర్ మండల తహశీల్దార్, జాయింట్ కల్లెక్టర్ శ్రీనివాస్ భూదాన యగ్నబోర్డును నుండి ప్రొసీడింగ్ ఆర్డర్స్ ను పొందిన 650 పేద కుటుంబాలకు వెంటనే "డి"ఫాం, పట్టాలను అందివాలని హైకోర్టు పంపిన ఆర్థర్ ను జతచేస్తూ…జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రెండుసార్లు లెటర్ లను కూడా పంపించారు. అంతేగాక ఇంటి నిర్మాణ అనుమతికై తారామటిపేట గ్రామ పంచాయతి పద్దులో ది: 29-01-2015న తలా3200/- రూపాయల చొప్పున చలానాలు కట్టి, జమ చేయటం కూడా జరిగిందని, అనేక సార్లు అధికారుల చుట్టూ తిరిగి ధర్నాలు కూడా చేసి వినతి పత్రాలు సమర్పిం చి, మొరపెట్టుకున్నప్పటికీ అమలుకు నోచుకోని వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన టిఆర్ఎస్ ప్రభుత్వం పేదల స్వంత ఇంటి కళను నిజం చేయలేక పోయిందని ఫలితంగా ఈసారి ఓటమి పాలైందని హెద్దేవా చేసారు. అంతేగాకా భూదాన బోర్డు పేదల కిచ్చిన ఇంటి స్థలాలకు వెంటనే "డి" ఫాం- పట్టాలను అందించాలని హైకోర్టు ఇచ్చిన వ్రైట్ పిటిషన్ 23601 OF 2015 డైరెక్షన్స్ ను కూడా లెక్క చేయకుండా పేదలకు భూదాన బోర్డు ఇచ్చిన ఇంటి స్థలాలను గుంజుకోజూసిందని. దాన్ని తీవ్రంగా నిరసిస్తూ హైకోర్టు డైరక్షన్స్ ను వెంటనే అమలు చేసి,"డి” ఫాం పట్టాలనిచ్చి, పక్కా గృహాలను కట్టివ్వాలనే డిమాండ్ లతో ఇందిరాపార్క్ వద్ద వందలాది మంది పెద్ద ఎత్తున "ధర్నా"చేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా వినతిపత్రి సమర్పించి మొర పెట్టుకున్నామన్నారు. మంత్రి హరీష్ రావును కూడా కలిసి విన్నవించుకున్నా కనీసంగా కూడా స్పందించ లేదన్నారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వంతో మోసపోయిన స్వంతఇండ్లులేని భూదాన్ యగ్నబోర్డు ద్వారా ప్రొసిడింగ్ ఆర్డర్స్ ను పొందిన పేదలు కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రేస్ రాష్ట్ర ప్రభుత్వం అయినా పేదల స్వంత ఇంటి కలను నిజం చేయాలని కోరారు."తారమపేట భూదాన భూముల్లో బోర్డు నుండి ప్రొసిగ్స్ ఆర్డర్ లను పొందిన పేద కుటుంబాలన్నింటికి వెంటనే డి ఫాం పట్టాలనిచ్చి, పక్కా గృహాలను నిర్మించి ఇవ్వాలని, అలాగే స్థానికంగా ఉండి, స్వంత ఇండ్లు లేని తారమతిపేట వాసులకు కూడా పక్కా గృహాలను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. కాగా జాయింట్ కలెక్టర్, తహశీల్దార్ స్పందించి మీ సమస్యౕ పరిష్కారం అయ్యేలా చూస్తామని హామి ఇచ్చారు.
Comment List