సింగరేణి కార్పొరేట్ ఏరియాలో ఐఎన్టియుసి పిట్ సమావేశాలు

ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఐఎన్టియుసి జనరల్ సెక్రెటరీ త్యాగరాజన్

On

అధ్యక్షత వహించిన కార్పొరేట్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ పీతంబరం

కొత్తగూడెం (న్యూస్ ఇండియా బ్యూరో నరేష్)ఆగస్టు 3: సింగరేణి  కోల్ మైన్స్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం  కార్పొరేట్ ఏరియా పరిధిలోని సివిల్ మరియు సెంట్రల్ ఆటో వర్కుషాప్, ఎక్షప్లోరేషన్ డిపార్ట్మెంట్లలో పిట్   సమావేశాలు  ఐఎన్టియుసి సెక్రటరీ జనరల్ మరియు మినిమమ్ వేజెస్ అడ్వైసరీ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ ఆదేశానుసారం బావి బాట కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశాలు నిర్వహించరు.ఈ సమావేశాలకు ఐఎన్టియుసి  జనరల్ సెక్రటరీ  త్యాగరాజన్ ముఖ్య అతిధులుగా, సెంట్రల్ కౌన్సిల్ నాయకులు ఆల్బర్ట్ , కార్పొరేట్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం , బ్రాంచ్ సెక్రెటరీ మహేష్ పాల్గొనగా,ఈ సమావేశలకు కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం అధ్యక్షత వహించారు.ఈ సందర్బంగా త్యాగరాజన్  మాట్లాడుతూ  ఐఎన్టియుసి కార్మిక పక్షపాతీగా నిత్యం వారి సంక్షేమం కోసం పోరాడుతూనే ఉందన్నారు. కార్మికులకు ఎన్నో డిమాండ్స్ ని  ఐఎన్టియుసి సాధించిపెట్టిందని, భవిష్యత్తులో ఇంకా ఎన్నో సాధిస్తుందన్నారు.ఇన్కమ్ టాక్స్ రద్దు, సొంతయింటి కల, కొత్త బావుల ఏర్పాటు ఇంకా ఎన్నో సాధించాలిసిఉంది. కార్మికులకు ఇస్తున్న వడ్డీ లేని ఋణం 10 లక్షల నుండి 20 లక్షలు చేయడానికి కూడ ఐఎన్టియుసి ప్రయత్నం చేస్తున్నది.లాబాIMG-20240803-WA1359IMG-20240803-WA1359IMG-20240803-WA1359 IMG-20240803-WA1357లలో 35 శాతంని బోనస్ గా ప్రకటించాలని యాజమాన్యాన్ని కోరడం జరిగింది. ఈ విషయమై ఐఎన్టియుసి సెక్రటరి జనరల్ మరియు మినిమం వేజెస్ అడ్వైసరి బోర్డు చైర్మన్జ జనక్ ప్రసాద్  రాష్ట్ర  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డికి మెమోరాండం సమర్పించడం జరిగిందని అన్నారు.461 పెండింగ్ డిపెండెంట్ ఉద్యోగాలను ఇప్పించడం జరిగిందని, ఉద్యోగ వయోపరిమితి ని 35 సంవత్సరముల నుండి 40 సంవత్సరములు పెంచడంలో  ఐఎన్టియుసి ముఖ్యపాత్ర పోసించి సాధించిందాన్నారు.కార్మికుల సౌలభ్యం కోసం సింగరేణి లోనే సూపర్ స్పెషలిటీ హాస్పిటల్స్ నిర్మించాలని ఐఎన్టియుసి  చేసిన కృషి పలించిందని, రామగుండం లో సర్వే కూడ నిర్వహించారని, కొత్తగూడెంలో కూడ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ నిర్మాణానికి కృషి చేస్తున్నామని త్యాగరాజన్ అన్నారు.యూనియన్ ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారటిల అమలుకి కట్టుబడి ఉన్నామని సింగరేణి లోని అన్ని ఏరియాలలో స్కిల్ డవలప్మెంట్ సెంటర్ లు ఏర్ప్పాటు చేయుటకు మానజ్మెంట్ తో సంప్రదిస్తామని  తెలిపారు. పెర్క్స్ పై ఇన్కమ్ టాక్స్ ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని కోరామన్నారు. నైని బ్లాక్ భవికి అన్ని అనుమతులు వచ్చి ఉత్పత్తికి సిద్ధంగా ఉందని, ఇల్లందు, కొత్తగూడెం  వీకే 7 ఓపెన్ క్యాస్ట్ లకు త్వరలో పర్యావరణ అనుమతులతో పాటు అన్ని అనుమతులు లభించునున్నాయని అన్నారు.గుర్తింపు సంగం కూడ మాతో కలిసివస్తే కార్మికులకు ఇంకా మేలుచేసే దిశగా ముందుకు సాగుతామని, సంస్థ మనుగడకు పాటుపాడుతామని తెలిపారు. ఐఎన్టియుసికి కార్మికుల, ఉద్యోగుల ఆధారాభిమానాలు, సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో త్యాగరాజన్ తో పాటు సెంట్రల్ కౌన్సిల్ నాయకులు ఆల్బర్ట్, కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం నాయకులు తిరుపతి రావు, ఎస్ .మధుసూదన్ రావు (చిన్ని ), సివిల్ డిపార్ట్మెంట్ పిట్ సెక్రటరీ సత్యనారాయణ,జాన్సన్ సుధాకర్, సోమశేఖర్ర,రహిమాన్, సత్యనారాయణ, పిట్ సెక్రటరీ రమేష్, శ్రీనివాస్, మధు మరియు సెంట్రల్ ఆటో వర్క్ షాప్ ఐఎన్టియుసి నాయకులు పిట్ సెక్రటరీ రాంకుమార్, రవి, సందీప్, తదితరులు పాల్గొన్నారు.

Views: 42
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News