రైతు రుణమాఫీ అమలుకు పకడ్బందీ చర్యలు

జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

రైతు రుణమాఫీ అమలుకు పకడ్బందీ చర్యలు

 

రైతులకు ఇబ్బంది లేకుండా,జిల్లా కేంద్రం, అన్ని బ్యాంకులలో హెల్ప్ డెస్క్ ఏర్పాట్లుIMG_20240718_141747

 

గురువారం ఉదయం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, సంబంధిత అధికారులు వ్యవసాయ, సహకార, బ్యాంకర్స్,లతో కలిసి రైతు రుణమాఫీ (పథకం) కార్యక్రమంపై తీసుకోవలసిన చర్యలు గురించి సమావేశం  నిర్వహించారు, 

Read More సెప్టెంబర్ 17నూ విద్రోహ దినంగా జరపండి

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే, రైతు రుణమాఫీ కార్యక్రమం జిల్లాలో పకడ్బందీగా నిర్వహించుటకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు, 

Read More సమాజాన్ని శాంతివైపు నడిపించిన దివ్య చరితుడు "మహమ్మద్ ప్రవక్త"...!

జిల్లాలో 27, వేల 249, మంది రైతు కుటుంబాలకు ఈ రుణమాఫీ వర్తిస్తుందని, 
ప్రభుత్వ నిబంధనల మేరకు
ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు,తేదీ . 12డిసెంబర్,2018, లేదా ఆ తరువాత మంజూయిన లేక  రెన్యువల్ అయిన రుణాలకు,  09-డిసెంబర్, 2023, తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుందని,
మొదటి విడత 1, లక్ష వరకు,
రెండవ విడత 1,లక్షల 50 వేల వరకు, మూడవ విడత 2 లక్షల వరకు దశలవారీగా రుణమాఫీ కార్యక్రమం జరుగుతుందన్నారు, 

Read More గౌరవ కార్పొరేషన్ చైర్మన్ గా ఆడారి నాగరాజు

ఈ పథకంలో ప్రయోజనం పొందే లబ్ధిదారుల జాబితాను అన్ని మండల ప్రజా పరిషత్ కార్యాలయాలు, రైతు వేదికలు,   తహసిల్దార్ కార్యాలయాలలో ప్రదర్శించడం జరుగుతుందన్నారు, 

జిల్లాలోని సుమారు (62) బ్యాంకులు, సహకార శాఖ (6) బ్యాంకులు, (18 ) సహకార శాఖ సొసైటీల ద్వారా రైతులకు నేరుగా వారి వారి ఖాతాలలో రుణమాఫీ సొమ్ము జమవుతుందని, ప్రతి బ్యాంకుకు ప్రత్యేక నోడల్ అధికారిని నియమించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు,

ఈ రైతు రుణమాఫీ (పథకం) కార్యక్రమంలో భాగంగా ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా కేంద్రం వ్యవసాయ శాఖ కార్యాలయంలో (గ్రీవెన్స్ సెల్), ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లు , *జి సుమలత, ఏఎస్ఓ, 7036081844,సుధాకర్, 9959493403, అరవింద్, 9381097902,* ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ నెంబర్లో సంప్రదించాలని సూచించారు, 

ఈ రైతు రుణమాఫీ కోసం వచ్చే రైతులకు పూర్తిగా సహకరిస్తూ వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్యాంకర్లు, రెవెన్యూ, వ్యవసాయ, సహకార శాఖ అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు, 

ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ఏడి కె.అభిమన్యుడు, డిసిఓ సత్యనారాయణ, ఎల్డిఎం మూర్తి, జిల్లా నోడల్ అధికారి జి.సారయ్య ,బ్యాంకర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు,

-----------------------------------------------------------
సమాచార పౌర సంబంధాల శాఖ, మహబూబాబాద్ వారిచే జారీ చేయనైనది.

Views: 34
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News