ఏళ్ల చరిత్ర గల పీర్ల పండుగ...

ఇక్కడ దేవుని మహిమలు అన్ని ఇన్ని కావు

ఏళ్ల చరిత్ర గల పీర్ల పండుగ...

IMG-20240718-WA0009

 తెలంగాణ రాష్ట్రంలో కులమాతాలకు అతీతంగా చేసుకునే పండుగ ఏదైనా ఉందంటే మొహరం పండుగనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఊకల్ గ్రామంలో హిందువులు అలాగే ముస్లిమ్స్ ఒకటై గత కొన్ని సంవత్సరాలుగా పీర్ల పండుగను ఘనంగా నిర్వహిస్తామని గ్రామస్తులు న్యూస్ ఇండియా న్యూస్ కు తెలిపారు. వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రంలో సాధారణంగా గ్రామాల్లో పీర్ల పండుగ అంటే సందడి వాతావరణాన్ని కనువిందు చేస్తుంది. అయితే అదే తరుణంలో ఊకల్ గ్రామంలో గత కొన్ని ఏళ్ల చరిత్ర గలిగిన పీర్ల పండుగను చేస్తున్నారు. గ్రామస్తులు చెప్పిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోనే పీర్ల పండుగ అనేది ఊకల్ గ్రామంలో నే చాలా అద్భుతంగా జరుపుతారని చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు తరలివచ్చి వారి కోరికలు కోరుకొని కోరికలు నెరవేరిన వారు మళ్లీ వచ్చే సంవత్సరంలో దేవునికి దస్తీలు, కుడుకలు,బెల్లం తులసి మాల ఇలా రకరకాలుగా దేవునికి అలంకరణ సంబంధించిన వస్తువులు భక్తులు ఇచ్చి వెళ్తుంటారు.

Views: 22
Tags:

Related Posts

Post Comment

Comment List