మురుకు నీరు పక్కనే విద్యార్థుల మధ్యాహ్న భోజనం

కలెక్టర్ సారు....... ఏంటి పిల్లల గోస పట్టించుకునే వారే లేరా...?

మురుకు నీరు పక్కనే విద్యార్థుల మధ్యాహ్న భోజనం

మురుకు నీరు పక్కనే విద్యార్థుల మధ్యాహ్న భోజనం

తొర్రూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో వసతుల కరువుతో బాధపడుతున్న విద్యార్థులు 

అధ్వానంగా దొడ్డు బియ్యం అన్నం తో విద్యార్థులను అవస్థకు గురి చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం

తొర్రూరు మున్సిపల్ చైర్మన్ కానీ కమిషనర్ పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు 

Read More  ఘనంగా క్రిస్మస్ గాస్పల్ వేడుక

భోజనశాల నిర్మాణ పనులు నిధులు లేవంటూ మధ్యలోనే ఆగిపోయిన వైనం
ప్రభుత్వ బడులపై విద్యార్థుల తల్లిదండ్రులకు ఇంకా నమ్మకం కలిగించలేకపోతున్న ఉన్నతాధికారులు

Read More సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన బోనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

కలెక్టర్ సారు....... ఏంటి పిల్లల గోస పట్టించుకునే వారే లేరా...?


మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో ఉన్నటువంటి జిల్లా ఉన్నత పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనలో ఈ పాఠశాల అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని  బహుజన్ సమాజ్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం అధ్యక్షులు ఈదునూరి ప్రసాద్, ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు మాలోతు సురేష్ బాబు, ఏఐఎఫ్డిఎస్ నాయకులు గుగులోతు అరుణ్ కుమార్ లు కలిసి పాఠశాల ను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పాఠశాలలో మౌలిక వసతులు కరువయ్యాయని, వానొస్తే వలవల గాలి వస్తే గలగల అన్న చందంగా పాఠశాలలో మినీ చెరువు తయారయ్యిందని, పాఠశాలలోనే నీళ్లు స్టోర్ అవుతున్నాయి అని , 700 మంది విద్యార్థులకు ఒకటీ,రెండు టాయిలెట్ మాత్రమే ఉందని, విద్యార్థులకు సన్నబియ్యం అందడం లేదని, పాఠశాలలో శుభ్రపరిచేందుకు మున్సిపల్ సిబ్బంది పనిచేయడం లేదని ఇప్పటివరకు మున్సిపల్ కమిషనర్ గాని చైర్మన్ గాని పాఠశాలను సందర్శించిన పాపాన పోలేదని నాయకులు మండిపడ్డారు.తక్షణమే ఎమ్మెల్యే గారు స్పందించి పాఠశాలలను సందర్శించి పాఠశాలలో అభివృద్ధి పనులు ప్రారంభించాలని అన్నారు.గతంలో మన ఊరు మనబడి ద్వారా పనులు ప్రారంభమై మధ్యలోనే ఆగిపోయాయని,అమ్మ ఆదర్శ పాఠశాల లో కూడా ఈ పాఠశాల సెలెక్ట్ కాకపోవడం సిగ్గుచేటనీ మండిపడ్డారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు గణేషు, తరుణ్, రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Views: 141
Tags:

Related Posts

Post Comment

Comment List