తెలంగాణలోని బొగ్గు బ్లాకులు సింగరేణికే కేటాయించాలి

కొత్తగూడెం లో ఐఎన్టీయూసీ నాయకులు

On
తెలంగాణలోని బొగ్గు బ్లాకులు సింగరేణికే కేటాయించాలి

IMG20240701170407IMG20240701170420IMG20240701170237IMG20240701170237 IMG20240701170237 తెలంగాణ బొగ్గు బ్లాక్లు సింగరేణికే కేటాయించాలి

 

Read More ప్రపంచ తెలుగు సాహితీ కళా జాతరకు

కొత్తగూడెం ఐఎన్టియుసి నాయకులు

 

Read More ప్రపంచ తెలుగు సాహితీ కళా జాతరకు

కొత్తగూడెం (న్యూస్ ఇండియా)జూలై 1: కొత్తగూడెం ఐ ఎన్ టియు సి కార్యాలయంలో జనరల్ సెక్రెటరీ సి .త్యాగరాజన్ ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఐఎన్టియుసి నాయకులు మాట్లాడుతూ తెలంగాణలోని  బొగ్గు బ్లాకులు సింగరేణి సంస్థకే  కేటాయించాలని. ఐ ఎన్ టి యు సి అధ్యక్షులు సంజీవ రెడ్డి, సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కి సింగరేణి సంస్థకు బొగ్గు బ్లాకులు కేటాయించాలని వినతి పత్రం ఇచ్చినట్లుగా తెలిపారు. గత బిఆర్ఎస్ బిజెపి ప్రభుత్వాల హయాంలోన్ 13మంది బిఆర్ఎస్ ఎంపీలు 2015లో ఎం ఎం డి ఆర్ యాక్ట్ 17(ఏ) కు సానుకూలంగా ఉండి, ఇప్పుడు ముసలి కన్నీరు  కారుస్తున్నారని అన్నారు. ఎం ఎం డి ఆర్ 17 (ఏ )ప్రకారం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించే అవకాశం ఉన్నా కూడా ఎందుకు కేటాయించడం లేదు అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఐఎన్టియుసి కార్మికులకు ఇచ్చిన  6గ్యారెంటీల హామీలకు కట్టుబడి ఉంటుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ సమాచారం శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం, కార్మికుల పక్షాన ఉంటూ, కార్మికులకు చెప్పిన ప్రతి హామీను నెరవేరుస్తుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేట్ వ్యక్తుల  చేతులోనికి తెలంగాణ బొగ్గు బ్లాక్ లను వెళ్ళనీయమని అన్నారు. అవసరమైతే కేంద్ర  ప్రభుత్వం మీద ఉద్యమానికి అయినా సిద్ధమన్నారు. ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి నాయకులు కేంద్ర కమిటీ  సభ్యులు ఆల్బర్ట్, ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్, కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పితాంబరం, ఇల్లందు ఏరియా వైస్ ప్రెసిడెంట్ జే.వెంకటేశ్వర్లు  , అభిషేక్, మహేష్, భీముడు, పోశం శ్రీనివాస్, సకినాల సమ్మయ్య, సత్తార్ పాషా, చిలక రాజయ్య, దుర్గ, ప్రభాకర్, ఐమాన్, మేంగని అశోక్, రాజేశ్వరరావు, గౌస్, కుమార్, నటరాజ్, కొమరయ్య, బిక్షపతి, కే. సమ్మయ్య, రీషి, ఎన్ సమ్మయ్య, వెంకటస్వామి, దుర్గ, పాషా, రెహమాన్, మహబూబ్, నవీన్, కంకిపాటీ రామారావు, శంకర్ ,మాధవ్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Read More రైతులు విద్యుత్ పట్ల జాగ్రత్తలు వహించాలి.

Views: 135
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News