కుంగిన జాతీయ రహదారిని పరిశీలించిన: కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి..
కుంగిన జాతీయ రహదారిని పరిశీలించిన: కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి..
ఎల్బీనగర్, జూన్ 27 (న్యూస్ ఇండియా ప్రతినిధి): ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్ నగర్ జాతీయ రహదారి హైవే బావార్చి ఎదురుగా రోడ్డు కుంగిందని సమాచారం రావడంతో స్థానిక డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి కుంగిన రోడ్డును పరిశీలించారు. ఈ సందర్బంగా వారు రోడ్ కింద భూగర్భ డ్రైనేజ్ ట్రంక్ లైన్ ఉండడం తో రోడ్ కుంగిందని వారు పరిశీలించి. వెంటనే సమందిత జలమండలి, నేషనల్ హైవే, R&B, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారికీ సమాచారం ఇచ్చి ముందస్తుగా కుంగిన రోడ్డు చుట్టూ బారికేడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ హైవే కనుక వాహనాదరులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలపడంతో పాటు కుంగిన రోడ్డు అంచనా వేసి వెంటనే ట్రంక్ లైన్, రోడ్డు మరమ్మత్తులు జరిపించాలని సమందిత అధికారులకి వారు తెలపడం జరిగింది. ఈ పరిశీలనలో జాతీయ రహదారి అధికారులు, బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ బండారి భాస్కర్, జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి పారంద మహేష్, జలమండలి సూపెర్వైసోర్ బాలు నాయక్, నాయకులు అరుణ్, డివిజన్ బీజేవైఎం అధ్యక్షులు ఎర్ర ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.
Comment List