అట్టహాసంగా తాటిపర్తి నామినేషన్ కార్యక్రమం
నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన వైసీపీ శ్రేణులు...
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం లో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.పట్టణంలో ముందుగా కార్యకర్తలు నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,ఒంగోలు వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసుల రెడ్డి హాజరయ్యారు.పట్టణంలో ప్రజలకు అభివాదం చేస్తూ తాటిపర్తి చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేసేందుకు యర్రగొండపాలెం ఆర్ ఓ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో భారీగా కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.ఈకార్యక్రమంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ,ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్ది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి ,పార్టీ పరిశీలకులు వెన్నా హనుమారెడ్డి ,వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుముల శ్రీనివాసరెడ్డి ,నియోజకవర్గ ప్రజాప్రతినిధులు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Comment List