రేపు తాటిపర్తి చంద్రశేఖర్ నామినేషన్
By Khasim
On
24-04- 2024 బుధవారం ఉదయం 9 గంటలకు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ వైసీ పీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ సందర్భంగా యర్రగొండపాలెంలోని వైసీపీ కార్యా లయం నుంచి బైక్ ర్యాలీ ఉం టుం దని చెప్పారు. వైయస్సార్ సెంటర్ వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. యర్రగొండపాలెం నియోజకవర్గంలోని వైసిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసి నన్ను ఆశీర్వదించాలని ఓ ప్రకటనలో తెలిపారు.యర్రగొండపాలెం నియోజకవర్గం లోని ఐదు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షు లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్పొ రేషన్ డైరెక్టర్లు, వార్డు సభ్యులు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, హాజరుకా వాలని కోరారు.
Views: 57
Tags:
Comment List