మానాల సౌదీ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక..!
రాజన్న సిరిసిల్ల, న్యూస్ ఇండియా ప్రతినిధి కోక్కుల వంశీ..
రాజన్న సిరిసిల్ల జిల్లా, రుద్రంగి మండలం మానాల సౌదీ సంఘం నూతన కార్యవర్గాన్ని శుక్రవారం సౌదీ లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన అధ్యక్షుడిగా అల్లూరి సంతోష్, ఉపా అధ్యక్షులు గా బెల్లాల తిరుపతి లను సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు అల్లూరి సంతోష్, ఉపా అధ్యక్షుడు బెల్లాల తిరుపతి మాట్లాడుతూ.. మానాల సౌదీ సంఘ అభివృద్ధికి, మరియు గ్రామ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని, అందరూ సహకరించాలని కోరారు.
తమను అధ్యక్షులు,ఉపా అధ్యక్షులు గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు పేరుపేరునా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మానాల సౌదీ సంఘం సభ్యులు తూము రవీందర్,జక్కు రాజారాం, లక్కకుల శ్రీనివాస్, దులూరి సాయన్న,బుర్ర జగన్,జంగిలి చిన్న గంగారాం,ఒలవేని గంగాధర్, తూము శంకర్,తూము రమేష్,అల్లూరి రవి, లక్కకుల రమేష్,బొర్రగల్లా తిరుపతి, గొల్లమాడ గణేష్,గోలి భూమేష్, గుర్రపు సుధాకర్ తదితరులు ఉన్నారు.
Comment List