పార్లమెంటు ఎన్నికల్లో మన సత్తా చూపిద్దాం..

మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే

On
పార్లమెంటు ఎన్నికల్లో మన సత్తా చూపిద్దాం..

కాస్తంత సంయమనం పాటించండి* *కష్టకాలంలో పార్టీని వదిలి వెళ్లిన వాళ్లు ముక్కునేలకు రాసినా పార్టీలోకి రానివ్వం

*కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ సన్నాహక సమావేశంలో ఎంపీ నామ నాగేశ్వరరావు*

*నామ పర్యటనకు అశ్వారావుపేట, కొత్తగూడెంలో అనూహ్య స్పందన*

*కొత్తగూడెం, ఏప్రిల్‌ 4*

ఎవరేమి అనుకున్నా మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే..కాస్తంత సంయమనం పాటించండి..ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో ఐక్యంగా కృషిచేసి ఖమ్మం ఎంపీ సీటు గెలుద్దాం..మన సత్తా ఏంటో చూపిద్దాం.. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి, కష్టకాలంలో పార్టీని వీడిన వారు మళ్లీ మన పార్టీలోకి వస్తామంటే వాళ్లు ముక్కు నేలకు రాసినా పార్టీలోకి రానివ్వబోమని బీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్షనేత, ప్రస్తుత ఖమ్మం బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్ధి నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. తప్పకుండా మళ్లీ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని నామ జోస్యం చెప్పారు. కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ...గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఎవరికీ రానంత మెజారిటీతో గెలిపించిన మిమ్మల్ని మర్చిపోననీ, మీకు సేవ చేసే అవకాశం మరోసారి కల్పించాలని ఎంపీ అభ్యర్ధి నామ పిలుపునిచ్చారు.

Read More సంక్రాంతి మన దేశంలో జరుపుకునే పెద్ద పండుగ..

*సంక్షేమ పథకాల్లో  దేశంలో తెలంగాణదే అగ్రస్థానం..*

Read More ఏడుగురు పేకాటరాయిలు అరెస్ట్..

భారతదేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుచేశామని గుర్తుచేశారు. కానీ గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ చేసిన అలవికాని హామీలకు ప్రజలు నమ్మారని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ భద్రాద్రి జిల్లాలో చాలా బలంగా ఉందన్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల గత అసెంబ్లీ ఎన్నికల్లో విభిన్నమైన తీర్పును చవిచూశామన్నారు. ప్రజలు అభివృద్ధిని, సంక్షేమాన్ని కండ్లారా చూసి కూడా ప్రజలకు కొన్ని కోర్కెలు, ఆశలు ఉంటాయని వాటి ఫలితంగానే మనం అనూహ్య తీర్పును ఎదుర్కొన్నామని అన్నారు. తొలిసారి తాను ఎంపీగా గెలిచినప్పుడు పార్లమెంటు నియోజకవర్గంలో జిల్లాలోని వాస్తవ పరిస్థితులు ఏంటన్నది, గత ఎంపీలు ఖమ్మం తరపున గెలిచి పార్లమెంటులో ఏం చర్చించారో అనే అంశాలపై రికార్డులు తీసి చూశానన్నారు. ఒక్కరు కూడా ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ సమస్యలపై చర్చించిన దాఖలాలు లేవన్నారు. భద్రాచలం కొవ్దూరు రైల్వేలైన్‌ను తాను మొదటి సారి ఎంపీగా గెలిచినప్పుడు అనేక రకాలుగా పోరాడి సాధించి పెట్టానని అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చిందే ప్రజలకు సేవ చేయాలనీ, జిల్లాను అభివృద్ధి చేయాలనే తప్ప మరేదీ కాదన్నారు. కార్యక్రర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. ఓట్లేసి గెలిచిన తరువాత కంటికి కనపడకుండా వెళ్లే వారు కాదు నిత్యం మీతో ఉండే తనను గెలిపించాలని కోరారు. 
సమావేశం లో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, కాపు సీతామహాలక్ష్మీ, వేల్పుల దామోదర్, జేవీస్   చౌదరి, ఎంపీపీ భూక్య సోని, ఎంపీపీ బధావత్  శాంతి, మోరే భాస్కర్, బత్తుల వీరయ్య, కొట్టి వెంకటేశ్వర్లు, తులసి రెడ్డి, కొల్లు పద్మ, అనుదీప్, సింధు తపస్వి, మున్సిపల్ కౌన్సిలర్లు అంబుల వేణు, బండి నరసింహ, పరమేష్ యాదవ్, కో ఆప్షన్ సభ్యులు యాకుబ్, ఉద్యమకారులు తొగరు రాజశేఖర్, రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్ యాదవ్ సహ పలువురు ప్రజా ప్రతినిధులు, మాజీ సర్పంచ్ లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Read More సంక్రాంతి శుభాకాంక్షలు..

Views: 43
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News