తొర్రూరు ఎక్సైజ్ స్టేషన్ స్పెషల్ ఆఫీసర్ గా ఆర్ ప్రవీణ్
On
తొర్రూరు ఎక్సైజ్ స్టేషన్ స్పెషల్ ఆఫీసర్ గా ఆర్ ప్రవీణ్ ను నియమించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఎక్సెజ్ శాఖలో మద్యం మాయం అనే శీర్షిక ఇటీవల వివిధ పత్రికల్లో ప్రచురించిన వెంటనే హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఆ ఎక్సైజ్ ఎస్సై రవళి రెడ్డి పై విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.. తాజాగా ఆ వార్త పై స్పెషల్ ఆఫీసర్ ప్రవీణ్ స్పందించారు. సోమవారం ఎక్సెజ్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... ఎస్సె రవళి రెడ్డిని డిసి అటాచ్డ్ గా పంపించడం జరిగిందని, రవళి రెడ్డి పై ఇంకా వారం రోజులు విచారణ జరుగుతుందని తప్పకుండా అధికారులు చర్యలు తీసుకుంటారని ఆర్ ప్రవీణ్ తెలిపారు
Views: 37
Tags:
Comment List