పాలకుర్తి చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసిందే పత్రికలు,ఎలక్ట్రాన్ మీడియా
సమిష్టిగా లేకపోతే పాలకుర్తి మీడియా అంటే అంత చులకన
శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం
*శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆదాయం లేకపోవడం ఏంటి
*ఆదాయం లేదని పత్రికలకు ప్రచురణార్థం యాడ్స్ ఇవ్వకపోవడం హస్యస్పదం
*పర్యాటక ప్రాంతంగా మారడంలో మీడియా పాత్ర కీలకం
*దేవస్థానం ఈవో నిర్వాహకులపై పలు విమర్శలు
*నాడు మీడియా సహకారంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి జాతర నిర్వహణ
*ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చొరవ తీసుకోవాలని మీడియా ప్రతినిధుల డిమాండ్
పాలకుర్తి
ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలలో ఒకటైన శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసింది పత్రికలు ఎలక్ట్రాన్ మీడియా అనే విషయాన్ని దేవస్థానం నిర్వాహకులు పట్టించుకోకుండా వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తోంది.
గతంలో ఉన్న ఆదాయం కంటే ఇపుడు ఆదాయం ఎక్కువగానే ఉందని గతంలో ఉన్న సీనియర్ ఈఓలు పత్రికలన్నిటికీ ప్రచురణార్థం ప్రకటనలు ఇచ్చిన విషయాన్ని మరిచిపోయి దేవస్థానం ఈఓ, నిర్వహకులు
సొంత నిర్ణయాలతో మీడియాపై అక్కసు ఎళ్ళగక్కడం వెనుక ఆంతర్యం ఏమిటో సర్వత్రా విమర్శలు లేకపోలేదు.
బమ్మెర, వల్మిడి, పాలకుర్తి ప్రాంతాలను కలుపుకుని సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానాన్ని పర్యాటక ప్రాంతంగా ఏర్పాటు చేసి అభివృద్ధి చెందడానికి కీలకమైన పాత్ర పోషించింది పత్రికలు, మీడియా అనే సంగతి మరిచిపోతే ఎలా అని పలు ప్రశ్నలకు తావిస్తుంది.
రాష్ట్రంలోని నలుమూలల నుండి స్వామి వార్ల దర్శనం కోసం వచ్చే భక్తులతో పాలకుర్తిలో రద్దీ పెరగడానికి కారణం పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా అనే విషయాన్ని గుర్తు పెట్టుకుంటే అందరికీ మంచిదని పలువురు మీడియా ప్రతినిధులు సూత్రపాయంగా సూచిస్తున్నారు.
దేవస్థానం చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసిన పత్రికలను ఈఓ,నిర్వహకులు
గుర్తుంచుకుంటే బాగుంటుందని
సున్నితంగా హెచ్చరిస్తున్నారు.
గతంలో మాజీ పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ జాతర అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా సహకారంతో పాటు అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి పటిష్టమైన చర్యలు తీసుకునే వారని మీడియా విషయంలో స్థానిక శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి చొరవ తీసుకోవాలని పలువురు మీడియా ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.
Comment List