గ్రీవేన్సీ ఫిర్యాదులపై పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలి

జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టొప్పో

గ్రీవేన్సీ ఫిర్యాదులపై పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలి

గ్రీవేన్సీ ఫిర్యాదులపై పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలి

::  జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టొప్పోIMG-20240213-WA0001

గ్రీవేన్సీ ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టొప్పో అధికారులను ఆదేశించారు. 

సోమవారం ఐ.డి.ఓ.సి లోని సమావేశ మందిరంలో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు.

Read More సంక్రాంతి శుభాకాంక్షలు..

ఈ సందర్భంగా  జామండ్లపల్లి గ్రామం చంద్రు తండా కు చెందిన  ఆంగోతు లింగమ్మ తన తండ్రి మరణించి 15 సంవత్సరాలు అయిందని  తహసిల్దార్ కార్యాలయం నుండి మరణ ధ్రువీకరణ పత్రము ఇప్పించగలరని కోరారు.

Read More సంక్రాంతి మన దేశంలో జరుపుకునే పెద్ద పండుగ..

మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామ రేగడి తండా కు చెందిన గణేష్ తను డిగ్రీ పూర్తి చేసి ఉపాధి లేక ఇబ్బందిగా ఉన్నదని తన అర్హతకు తగిన ఉద్యోగాన్ని ఇప్పించగలరని కోరారు.

Read More ఏడుగురు పేకాటరాయిలు అరెస్ట్..

బయ్యారం మండలం కోటగడ్డ గ్రామానికి చెందిన నల్లబెల్లి శ్రీనివాస్ తన గేదె మూడు సంవత్సరాల క్రితం మరణిస్తే వివరాలు తెలిపి అధికారులకు తెలిపియుంటినని అట్టి గేదకు సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పించగలరని కోరారు.

గూడూరు మండలం చిన్న ఎల్లాపూర్ గ్రామానికి చెందిన కమల గత ప్రభుత్వంలో తనకు గృహ లక్ష్మీ పథకం కింద ఇల్లు మంజూరు కాగా కొంత పనిని చేపట్టినానని అట్టి నిర్మాణముకు ఇప్పుడు ఇందిరమ్మ ఇంటిగా సాంక్షన్ చేసి తనను ఆర్థికంగా ఆదుకోగలరని కోరారు.

ఈరోజు నిర్వహించిన గ్రీవెన్స్ లో వచ్చిన( 114  ) దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు  పరిష్కారానికి ఆదేశించారు.

ఈ ప్రజావాణిలో జడ్పీసీ.ఈ.ఓ రమాదేవి, సి.పి.ఓ సుబ్బారావు ఇతర జిల్లా అధికారులు,  మండలాధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Views: 9
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News