కేసీఆర్ నిర్వాకం వల్లే కృష్ణా నీటి జలాల్లో తెలంగాణకు అన్యాయం* 

మాజీ టీపీసీసీ సభ్యుడు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి .

కేసీఆర్ నిర్వాకం వల్లే కృష్ణా నీటి జలాల్లో తెలంగాణకు అన్యాయం* 

*కేసీఆర్ నిర్వాకం వల్లే కృష్ణా నీటి జలాల్లో తెలంగాణకు అన్యాయం* 
*తొర్రూరు:*
కెసిఆర్ నిర్వాకం వల్లే కృష్ణా జలాల పంపకాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని మాజీ టీపీసీసీ సభ్యుడు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.


కృష్ణా జలాల వాటా విషయంలో బీఆర్ఎస్ పార్టీ ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ మండల,పట్టణ కమిటీల ఆధ్వర్యంలో డివిజన్ కేంద్రంలోని గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన కార్యక్రమం చేపట్టారు. మాజీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.....
తెలంగాణ రాష్ట్రంలో నీటి వాటాల్లో అన్యాయం జరిగింది కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని గుర్తు చేశారు.  కానీ టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గత పదేళ్లలో ఉమ్మడి రాష్ట్రం కంటే ఎక్కువ అన్యాయం చేశారన్నారు.
 జీఓ 203 ద్వారా రాయలసీమ ప్రాజెక్టు చేపట్టారని,  దీనికి నాటి తెలంగాణ ప్రభుత్వం మౌనం వహించి ఆ ప్రాజెక్టుకు పచ్చ జెండా ఊపిందన్నారు.
రాయలసీమ ప్రాజెక్టు వల్ల.. శ్రీశైలం పై ఆధారపడిన తెలంగాణ ప్రాజెక్టుల పరిస్థితి ప్రశ్నర్దాకంIMG-20240213-WA0024 గా మారాయని అన్నారు. 2014 తర్వాత.. నాటి సీఎం కేసీఆర్ 1200 టీఎంసీల నీరు బయట బేసిన్ లకు తరలించారని విమర్శించారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక నీటి తరలింపు పెరిగిందన్నారు.
నదీ జలాల పంపకాలు.. పరివాహక ప్రాంతం, జనాభా, సాగును దృష్టిలో పెట్టుకొని చేస్తారని, కానీ, కృష్ణా నీటి పంపకాల్లో దీనికి విరుద్ధంగా జరిగిందని అన్నారు. కృష్ణాలో తెలంగాణ పరివాహక ప్రాంతం 68శాతం ఉంటే.. కేటాయింపులు 33శాతంకు గత ప్రభుత్వం ఒప్పుకుందన్నారు. నీటి ప్రాజెక్టుల విషయంలో కెసిఆర్ చేసిన పాపాలు తెలంగాణకు శాపాలుగా మారాయన్నారు.
కృష్ణా నది జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా రాబట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం హర్షనీయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ హమ్య నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్, పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్, పెదగాని సోమయ్య మున్సిపల్ కౌన్సిలర్లు భూసాని రాము,తూనం రోజా, నర్కూటి గజానంద్,కాంగ్రెస్ నాయకులు చిత్తలూరు శ్రీనివాస్ గౌడ్, కందాడి అచ్చిరెడ్డి, ధర్మారపు మహేందర్,గాండ్ల సంజీవ,ధరావత్ సోమన్న,జాటోత్ రవి నాయక్, బచ్చలి లక్ష్మణ్, బి.వెంకన్న యాదవ్, జలగం రామ్మూర్తి, ప్రవీణ్, వెంకన్న మాదిగ, మహేష్ యాదవ్,అరవింద్, మనోహర్, ప్రహ్లాద రావు, రాంబాబు, భరత్,ఎనగందుల శ్రీను, దేవుడు, బొలగాని శ్రీనివాస్,మోకాటి వెంకన్న, రోహిన్ కుమార్, సంతోష్ నాయక్, కృష్ణ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Read More  ఘనంగా క్రిస్మస్ గాస్పల్ వేడుక

Views: 9
Tags:

Related Posts

Post Comment

Comment List