పెదపాటి అమ్మాజీకి జై.. కంబాల జోగులుకు నై
వైవీ సుబ్బారెడ్డికి తేల్చిచెప్పిన పాయకరావుపేట వైసీపీ కేడర్
అనకాపల్లి జిల్లా న్యూస్. పాయకరావుపేట నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి బాధ్యతలు నాన్ లోకల్ కు అప్పగించడంపై స్థానిక వైసీపీ నేతలు భగ్గుమన్నారు. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డిని విజయవాడలో కలిసి తమ నిరసన తెలిపారు.
స్థానికురాలైన ఏపీ ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీకే పార్టీ టికెట్ కేటాయించాలంటూ వైవీ సుబ్బారెడ్డిని కలిసి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వినతిపత్రం అందించారు. నాన్ లోకల్ కు టికెట్ ఇస్తే ఓటమి తప్పదని.. వెంటనే నిర్ణయం మార్చుకోవాలని కోరారు. వైవీ సుబ్బారెడ్డిని కలిసిన వారిలో పాయకరావుపేట నియోజకవర్గం సీనియర్ నాయకులు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List