టీడీపీ వ్యూహంతో ఇంఛార్జిలను మళ్లీ మారుస్తున్న జగన్

పాయకరావుపేటలోనూ మహిళా నేతకు బాధ్యతలు అప్పగించే ఛాన్స్!

On
టీడీపీ వ్యూహంతో ఇంఛార్జిలను మళ్లీ మారుస్తున్న జగన్

రాజ్యసభ సీట్లలోనూ కొన్ని మార్పులు ఉండే అవకాశం ?

Screenshot 2023-11-17 162857

వైసీపీ అధినేత సీఎం జగన్ మళ్లీ అభ్యర్ధులను మార్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొందరు ఇంఛార్జిలను మార్చిన జగన్.. ఇప్పుడు వివిధ సర్వేలతోపాటు ఐ ప్యాక్ ఇంటర్నల్ రిపోర్టులో వచ్చిన వారి పేర్లను  పరిశీలిస్తున్నారు.    అవనిగడ్డ నుంచి ఇంఛార్జ్‌గా డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌రావుకు బాధ్యతలు అప్పగించారు. కానీ డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖరరావు ఆ బాధ్యతలు చేపట్టకుండా తప్పుకొన్నారు. వయసురీత్యా తాను చేయలేనని, తన కుమారుడికి ఆ బాధ్యత అప్పగించాలని.. ఆయన సీఎం జగన్‌ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిసి కోరారు. 'ఈసారికి మీరే పోటీ చేయాలని' సీఎం చెప్పగా.. వయసు రీత్యా చేయలేనని, తన కుమారుడు రామ్‌చరణ్‌కు ఆ బాధ్యత అప్పగించాలని కోరారు. చర్చ తర్వాత రామ్‌చరణ్‌ను సమన్వయకర్తగా నియమించేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. అటు పాయకరావుపేటలోనూ ప్రస్తుత ఇంఛార్జి కంబాల జోగులును మార్చి.. ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీకి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కంబాల జోగులుకు స్థానిక నాయకులు ఎవరూ సహకరించడం లేదని, స్థానిక నాయకులకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 

అటు రాజ్యసభ అభ్యర్థులను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మార్చివేశారు. గతంలో లీక్‌లు ఇచ్చిన ముగ్గురిలో ఒక అభ్యర్థిని మార్చేశారు. ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు స్థానంలో కడపకు చెందిన మేడా రఘునాథరెడ్డి పేరు జగన్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. మొత్తం మూడు సీట్లలో పోటీ చేయాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది..

రాజ్యసభ అభ్యర్థులను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మార్చివేశారు. గతంలో లీక్‌లు ఇచ్చిన ముగ్గురిలో ఒక అభ్యర్థిని మార్చేశారు. ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు స్థానంలో కడపకు చెందిన మేడా రఘునాథరెడ్డి పేరు జగన్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. మొత్తం మూడు సీట్లలో పోటీ చేయాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. సాయంత్రం ముగ్గురి పేర్లు ప్రకటిస్తారని సమాచారం. వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథరెడ్డి పేర్లు ఖరారు అవుతాయని సమాచారం. ఈ నెల 8న అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు కావడంతో ఎమ్మెల్యేలతో మాక్ పోలింగ్ నిర్వహించాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది.

Read More సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన బోనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

రాజ్యసభ ఎన్నికలు రాష్ట్రంలో వేడి పుట్టిస్తున్నాయి. సాధారణంగా ఏకగ్రీవంగా జరిగే ఈ ఎన్నికల్లో ఈసారి పోటీ తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. వైసీపీలో అంతర్గత సంక్షోభాన్ని ఆసరా చేసుకుని ఒక సీటు కైవసం చేసుకోడానికి టీడీపీ పావులు కదుపుతోంది. తమ ఎమ్మెల్యేలు చేజారకుండా చూసుకోడానికి అధికారపక్షం తిప్పలు పడుతోంది. ఈసారి రాష్ట్రం నుంచి ముగ్గురు రాజ్యసభ ఎంపీలు రిటైర్ అయ్యారు. వారి స్థానాలకు ఎన్నికల నిర్వహణకు కొద్ది రోజుల క్రితం షెడ్యూల్ వెలువడింది.

Views: 37
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News