కంగ్టి గ్రామ పంచాయతీకి ఎస్సీ రిజర్వేషన్ కేటాయించాలి
సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన కంగ్టి లో ఎస్సీ యూత్ ఆధ్వర్యంలో సోమవారం ఎంపీడీవో కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మండల కేంద్రమైన కంగ్టి గ్రామానికి ఎస్సి రిజర్వేషన్ కేటాయించాలని అన్నారు.కంగ్టి గ్రామ పంచాయతీ ఏర్పడ్డ నుండి ఇప్పటివరకు గ్రామ పంచాయతీకి ఎస్సి సర్పంచ్ రిజర్వేషన్ కేటాయించకపోవడం విచారకరమని అన్నారు.గ్రామంలో 2996 ఓటర్లు ఉన్నారని అందులో మెజారిటీ జనాభా 650 కి పైచిలుకు ఎస్సీల ఓట్లు ఉంటాయని అన్నారు. కావున దయచేసి వచ్చే గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కంగ్టి గ్రామ పంచాయతీకి ఎస్సీ రిజర్వేషన్ కేటాయించాలని అలాగే అవసరమైనన్ని వార్డు మెంబర్లకు కూడా జనాభా ప్రతిపదికన వార్డు మెంబర్ల సంఖ్య పెంచి ఎస్సీ రిజర్వేషన్ కేటాయించాలని కోరారు.ఇప్పటికైనా నాయకులు అధికారులు చొరవ తీసుకొని గ్రామ పంచాయతీకి సర్పంచ్ ఎస్సీ రిజర్వేషన్ కేటాయించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ యూత్ అరుణ్, రాజు, సీమోన్, సచిన్, సందీప్, అజయ్, రాహుల్, పవన్, శ్రీమాన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Comment List